క్రైమ్

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం… ప్రభాకర్‌రావు ల్యాప్‌టాప్‌, ఫోన్‌ సీజ్‌

  • డేటా బ్యాకప్‌ కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు అందజేత

  • విచారణను వేగవంతం చేసిన సిట్‌

  • ఈనెల 14న మరోసారి ప్రభాకర్‌రావు విచారణ

క్రైమ్‌ మిర్రర్‌, హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుకు చెందిన ల్యాప్‌టాప్‌, ఫోన్‌ను సిట్‌ అధికారులు సీజ్‌ చేశారు. ప్రభాకర్‌రావుకు చెందిన ల్యాప్‌టాప్‌, ఫోన్‌లో ఉన్న డేటా కేసులో అత్యంత కీలకంగా మారనుందని తెలుస్తోంది. కాల్‌ డేటా, ఇతర డేటాను బ్యాకప్‌ చేసేందుకు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు అధికారులు.

ఆ 8మంది కాలి బూడిదయ్యారు, అధికారుల ప్రకటన

ప్రభాకర్‌రావు అరెస్ట్‌ తర్వాత ఈ కేసులో సిట్‌ విచారణ వేగం పుంజుకుంది. ఇప్పటికే చాలా మంది ఫోన్లు ట్యాప్‌ అయినట్లు అధికారులు గుర్తించారు. బాధితులు, నిందితులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసి, స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారు అధికారులు. ప్రభాకర్‌రావు విచారణకు సహకరించడంలేదని చెబుతున్న సిట్‌ అధికారులు… అతని ఫోన్‌, ల్యాప్‌ టాప్‌ నుంచి డేటా సేకరించాక పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి. ఇదే కేసులో ప్రభాకర్‌రావును ఈనెల 14న మరోసారి విచారణకు హాజరుకావాలని సిట్‌ అధికారులు సమాచార అందించినట్లు తెలుస్తోంది.

Back to top button