
కేశినేని నాని 2024 ఎన్నికల ముందు టీడీపీని వీడి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడితో ఆగారా… టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన తనయుడు లోకేష్‌ను నోటి కొచ్చినట్టు ఆడిపోసుకున్నారు. సోదరుడు చిన్నిపై పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆ తర్వాత సైలెంట్‌గా ఉండిపోయి.. ఇప్పుడు టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారట నాని. మరి, సోదరుడు కేశినేని చిన్ని ఒప్పుకుంటున్నారా? అంటే ఒప్పుకున్నారు కానీ, షరతులు వర్తిస్తాయని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఇంతకీ మళ్లీ టీడీపీలోకి వెళ్లాలని కేశినేని నాని ప్రయత్నిస్తున్న మాట నిజమేనా ? నాని వస్తానంటే.. చిన్ని పెడుతున్న కండిషన్స్ ఏంటి?
కేశినేని నాని విజయవాడ ఎంపీగా వరుసగా రెండు సార్లు పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని తట్టుకుని మరీ మంచి మెజార్టీతో గెలిచారు. 2024 ఎన్నికలు వచ్చే సరికి టీడీపీలో తనకు కాకుండా… సోదరుడు కేశినేని నానికి ప్రాధాన్యం ఇవ్వడం ఆయనకు మింగుడు పడలేదు. టీడీపీ అధిష్టానం ఎన్ని సార్లు బుజ్జగించినా… ఆయన ఆ పార్టీలో ఇమడలేకపోయాడు. సరిగ్గా ఎన్నికల ముందు టీడీపీని వీడి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల సమయం కావడంతో మైలేజీ కోసం మాజీ బాస్‌పై ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేశారు. తమ్ముడి చేతిలోనే ఓటమి చవిచూశారు. ఇప్పుడు వైసీపీ వీడి మళ్లీ టీడీపీలో చేరాలని ప్రయత్నిస్తున్నారు కానీ ఆయన నోటి దురుసే ఇబ్బందిగా మారుతోంది.
Also Read : టీడీపీ క్యాడర్‌లో పెరుగుతున్న అసంతృప్తి – కూటమి కల్లాసేనా..!
అంతేకాదు టీడీపీలోకి కేశినేని నాని ఎంట్రీని తమ్ముడు చిన్ని అంగీకరిస్తారా..? అన్న ప్రశ్న అందరిలో ఉంది. అయితే అలాంటిది ఏమీ లేదని అంటున్నారు చిన్ని. కేశినేని నాని మళ్లీ టీడీపీలోకి వస్తానన్నా తనకేమీ అభ్యంతరం లేదంటూనే కొన్ని అడ్డంకులు ఉన్నాయని చెప్పకనే చెప్పారు. కూటమిలో చేరాలనుకునే వారికి కొన్ని కండిషన్స్ వర్తిస్తాయని అంటున్నారు చిన్ని. అదేంటో తెలుసా.? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తోపాటు ప్రధాని మోడీపై వ్యక్తిగత విమర్శలు చేసిన వారిని, నోటి కొచ్చినట్టు వారిపై ఆరోపణలు చేసిన వారిని… కూటమి పార్టీల్లో చేర్చుకోకూడదనే రూల్ ఉందట. మరి కేశినేని ఆ రూల్ ప్రకారం నడుచుకుంటే తనకేమీ అభ్యంతరం ఉండదంటున్నారు. అంటే ఎన్నికల ముందు కేశినేని నాని… చంద్రబాబును, లోకేష్‌ను ఇష్టమొచ్చినట్టు తిట్టారు. తీవ్రమైన ఆరోపణలు చేశారు. కనుక ఆయన్ను పార్టీలోకి తీసుకునే ప్రశ్నే ఉండదని.. అంతకాడికి తాను అభ్యంతరం చెప్పడం ఎందుకని చిన్ని అనుకుంటూ ఉండొచ్చు. ఏది ఏమైనా కేశినేని నాని టీడీపీలోకి వెళ్లాలన్నా ఆయన నోటి దురుసే అడ్డం పడుతున్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి ..
-
జేఈఈ విద్యార్థుల వివాదం – నిజం నిగ్గుతేలుస్తానన్న పవన్..!
-
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడి హెల్త్ కండీషన్ సీరియస్
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
టీడీపీ నెక్ట్స్ టార్గెట్ మాజీ మంత్రి రోజా – ఆడుదాం ఆంధ్రాలో అవినీతి పేరుతో కేసులు..?
-
ఏపీలో 2029లో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది: ఉండవల్లి అరుణ్ కుమార్