
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో : కేశినేని నాని – కేశినేని చిన్ని.. ఇద్దరూ అన్నదమ్ములు. కానీ.. బద్ద శత్రువులు. వ్యక్తిగతంగానే కాదు.. రాజకీయంగానూ వీరిద్దరిదీ చెరో దారి. 2024 ఎన్నికల నుంచి వీరి మధ్య పోరు మరింత రాజుకుంది. ఇప్పుడు అన్నదమ్ముల గొడవలో.. ఎమ్మెల్యే కొలికపూడి తలదూర్చాడు. కేశినేని నానిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది…? వాట్ నెక్ట్స్…? అబ్ క్యా హోగా..? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ఆసక్తి కనిపిస్తోంది.
ఏపీ రాజకీయాలు రోజురోజుకూ ఉత్కంఠ రేపుతున్నాయి. అందులో ఈ మధ్య.. విజయవాడ పాలిటిక్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా కేశినేని సోదరుల మధ్య జరుగుతున్న వివాదం… మరింత వేడి రాజేస్తోంది. 2024 ఎన్నికల్లో కేశినేని నానికి రావాల్సిన విజయవాడ ఎంపీ టికెట్‌ను కేశినేని చిక్కి దక్కించుకున్నారు. దీంతో… రగిలిపోయిన కేశినేని నాని… టీడీపీ గుడ్‌బై చెప్పి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేశారు. కానీ.. తమ్ముడి చేతిలో ఓటమి తప్పలేదు. దీంతో.. రాజకీయాలకు రాంరాం చెప్పారు. కానీ.. ఈ మధ్య మళ్లీ యాక్టివ్ అయ్యారు కేశినేని నాని. తమ్ముడు కేశినేని చిన్ని టార్గెట్‌గా అస్త్రాలు సంధిస్తున్నారు. చిన్నిపై అవినీతి ఆరోపణలు చూస్తూ.. అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ నిందితులకు చిన్నికి సంబంధాలు ఉన్నాయని… సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు కేశినేని నాని. తనపై అన్న చేస్తున్న ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నారు చిన్ని. సోదరుల మధ్య జరుగుతున్న ఈ ఫైట్‌లో కూటమి నేతలు తలదూర్చలేదు. కానీ.. ఇప్పుడు… తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ జోక్యం చేసుకున్నారు. కేశినేని నానిని టార్గెట్ చేశారు.
అసలు ఏం జరిగిందంటే… విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ సంస్థ ఉర్సా క్లస్టర్ ముందుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం… ఆ సంస్థకు విశాఖలో భూములు కూడా కేటాయించింది. ఈ విషయం తెలుసుకున్న కేశినేని నాని… సీఎం చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. ఉర్సా క్లస్టర్ సంస్థ బోగస్ అని… దాని వెనుక కేశినేని చిన్ని ఉన్నారని ఆరోపించారు. ఆ తర్వాత… లిక్కర్ నిందితులతో చిన్నకి ఉన్న లింకులను ఆధారాలతో సహా చూపిస్తూ.. చంద్రబాబుకు మరో లేఖ రాశారు. ఇలా… అడుగడుగునా కేశినేని చిన్నిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు కేశినేని నాని. ఇంత జరుగుతున్నా… కూటమి నేతలు చిన్నికి అండగా నిలబడలేదు. కేశినేని నానికి కౌంటర్ ఇవ్వలేదు. కానీ.. కొలికపూడి మాత్రం ముందుకొచ్చారు. కేశినేని నాని అవినీతిపై ఏకంగా సీబీఐకి లేఖ రాశారు.. ఎమ్మెల్యే కొలికపూడి.
కూటమి నేతలంతా మనకెందుకని అనుకుంటుంటే… తిరువూరు ఎమ్మెల్యే కొలిపూడి మాత్రమే ఎందుకు చిన్ని సపోర్ట్ నిలబడ్డారు..? ఈ డౌట్ అందరికీ వస్తుంది కదూ. ఎందుకంటే… కొలికపూడికి తిరువూరు టికెట్ రావడానికి కారణం కేశినేని చిన్ని అని సమాచారం. ఎన్నికల తర్వాత కూడా…. తిరువూరు నియోజవర్గంలో వివాదలు తలెత్తాయి. వాటన్నింటిలో కొలికపూడికి చిన్ని అండగా నిలిచారు. అందుకే.. ఇప్పుడు… కేశినేని చిన్ని తరపున వకాల్తా పుచ్చుకున్నారు కొలికపూడి. కేశినేని చిన్నిని విమర్శిస్తున్న నానికి కౌంటర్ ఇ్చారు. కేశినేని నాని ఆర్థిక అక్రమాలపై దర్యాప్తు చేయాలని ఆయన ఏకంగా.. సీబీఐకి లేఖ రాసేశారు. ఉద్దేశపూర్వకంగానే నాని.. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ డబ్బును షెల్ కంపెనీలకు మళ్లించినట్టు కూడా రాశారు కొలికపూడి. పదేళ్లుగా ఆయన ఎంపీ పదవిని దుర్వినియోగం చేశారని ఘాటు విమర్శలు చేశారు. కొలికపూడి ఎంట్రీ తర్వాత.. ఈ వివాదం ఏ మలుపు తిరగబోతోంది. కేశినేని నానిపై ఆయన చేసిన ఆరోపణలను.. సీబీఐ పరిగణనలోకి తీసుకుంటుందా…? విచారణ చేస్తుందా…? ఏమో.. ఏదైనా జరగొచ్చు.