
Sona Eldhose Case: కేరళలో దారుణం జరిగింది. ఎర్నాకుళంలో 23 ఏళ్ల సోనా ఎల్డోస్ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ప్రియుడు, అతని బంధువులు పెళ్లి చేసుకోవాలంటే ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేశారని, అందుకే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబం ఆరోపించింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
రళలోని కోతమంగళానికి చెందిన సోనా ఎల్డోస్ తాజాగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మృతురాలు రాసిన సూసైడ్ నోట్ లభించడంతో మతమార్పిడి కోసం శారీరక, మానసిక హింసకు గురైనట్లు గుర్తించారు సోనా అనే యువతి టీచర్స్ ట్రైనింగ్ కోర్సు చదువుతోంది. ఆమె రమీజ్ అనే యువకుడిని కొంతకాలంగా ప్రేమిస్తోంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే, రమీజ్ అతని ఫ్యామిలీ.. సోనాను తమ మతంలోకి మారాలని ఒత్తడి చేశారు. అంతేకాదు, రమీజ్ ఆమెను ఇంటికి తీసుకెళ్లి బెదిరించాడు. అతడికి కుటుంబ సభ్యులు కూడా వత్తాసు పలికారు. ఈ నేపథ్యంలోనే తాను చనిపోతున్నట్లు సోనా సూసైడ్ లెటర్ లో రాసింది.
రమీజ్ ను అరెస్టు చేసిన పోలీసులు
సోనా సూసైడ్ లెటర్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమె ప్రియుడు రమీజ్ ను అరెస్టు చేశారు. అతడిపై BNS సెక్షన్ 69 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబధించి సోనా తల్లి షాకింగ్ విషయాలు వెల్లడించారు. రమీజ్ కుటుంబం గతంలో వివాహ ప్రతిపాదనను తీసుకువచ్చిందని.. పెళ్లి కోసం సోనాను తమ మతంలోకి మారాలని పట్టుబట్టారని చెప్పుకొచ్చారు. సోనా మొదట దీనిని ప్రేమతో అంగీకరించిందని, కానీ రమీజ్ అనైతిక వ్యవహారాలు చూసిన తర్వాత నిరాకరించిందన్నారు. మతం మారాలనే వేధింపులకు గురి చేశారని చెప్పారు. వాటిని తట్టుకోలేక సోనా చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో రమీజ్ కుటుంబ సభ్యులపైనా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Read Also: భార్య శవాన్ని బైక్ కు కట్టుకుని.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో!