
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంలో మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ స్పందించడం జరిగింది. రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అలాగే భారీ వరదలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యంగా భారీ వర్షపాతం నమోదైన పలు జిల్లాలలో చాలా ఇల్లు మునిగిపోయాయని అన్నారు. ఆయా జిల్లాలలో రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవడం పట్ల కేసిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యంగా నీట మునిగిన ప్రాంతాల చుట్టుపక్కల ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలతో కెసిఆర్ నేడు ఫోన్లో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకున్నారు. కాంగ్రెస్ నాయకుల విషయం గురించి పక్కన పెడితే… బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూనే సహాయక చర్యలు చేపట్టాలని తన తనయుడు కేటీఆర్ తో పాటు పార్టీ శ్రేణులను అలాగే కార్యకర్తలను కెసిఆర్ ఆదేశించారు.
Read also : ఉత్తరాదిలో ఆకస్మిక వరదలు..స్తంభించిన జనజీవనం!
కాంగ్రెస్ ప్రభుత్వం ను కూడా ఈ భారీ వర్షాలపై ఎప్పటికప్పుడు నివేదికలను తయారు చేయాలని కోరారు. ఏది ఏమైనా కూడా ఈ ఏడాది భారీ వర్షపాతం నమోదవుతుంది. తెలంగాణలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అన్ని రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులు, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ కూడా నీట మునిగాయి. జాబ్ చేసే ఉద్యోగులు.. ఆయా కంపెనీలకు వెళ్లాలన్న ట్రాఫిక్ జామ్ లేదా రోడ్లు జలమయం కావడం లాంటి వాటి వల్ల ఇళ్లలోనే ఉండిపోవాల్సి వస్తుంది. మరోవైపు పలు జిల్లాలలోని లోతట్టు ప్రాంతాలలో పూర్తిగా నీరు నిలిచిపోవడంతో ఒకవైపు రైతులు మరోవైపు పారిశ్రామికవేత్తలు కూడా పనుల నిమిత్తం బయటకు వెళ్లలేకపోతున్నారు. నీరు సమృద్ధిగా ఉందని పంటలు వేసిన రైతులు నేడు వరదల కారణంగా చాలానే నష్టపోతున్నామని చెప్పుకొస్తున్నారు. కాబట్టి ఎక్కడైతే నష్టం వాటిల్లిందో ఆ ప్రాంతాలను పూర్తిగా పరిశీలించి… తగినంత సహాయం చేయాలని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
Read also : భారీ వర్షాలకు కోతకు గురైన నేషనల్ హైవే?