తెలంగాణరాజకీయం

అంతా కేసీఆరే చేశాడు - ఆ ఒక్క తప్పే కొంపముంచిదన్న ఎర్రబెల్లి

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది... బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ విలువ ఇప్పుడు ప్రజలు తెలిసొచ్చిందని చెప్పారు.

కేసీఆర్‌ వల్లే బీఆర్‌ఎస్‌ ఓడిపోయిందా…? ఆ ఒక్క తప్పు చేసుండకపోతే…. గులాబీ పార్టీ గెలుచుండేదా…? ఇంతకీ కేసీఆర్‌ చేసిన ఆ తప్పేంది…? బీఆర్‌ఎస్‌ ఓటమికి… ఎర్రబెల్లి చెప్తున్న లెక్కేంటి…? ఒక లుక్కేందాం.

తెలంగాణ ఏర్పాటు తర్వాత… వరుసగా రెండుసార్లు అధికారంలో వచ్చి… పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్‌ఎస్‌కు…. 2018 ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. అయితే… ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం. టీపీపీఎస్సీ పేపర్‌ లీకేజీ అంశం…. డబుల్‌ బెడ్‌రూమ్‌లు కేటాయించకపోవడం… ఇలాంటి ఎన్నో ఉన్నాయన్న విశ్లేషణలు వచ్చినాయి. అయితే అవన్నీ కాదు…. బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది కేసీఆర్‌ చేసిన తప్పు వల్లే అంటున్నారు ఆ పార్టీ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. ఆయనకు ఎందుకు అలా అనిపించిందో మరి. ఇంతకీ కేసీఆర్‌ చేసిన ఆ తప్పేంటో తెలుసా…. అభ్యర్థులను మార్చకపోవడమట.


Also Read : పనులు మంచివే… ప్రచారమే నిల్‌ -కాంగ్రెస్‌లో గడ్డుపరిస్థితి-ఎందుకీ దుస్థితి..!


2018 ఎన్నికల ముందే… పార్టీ పరిస్థితి బాగోలేదని కేసీఆర్‌తో చెప్పారట ఎర్రబెల్లి దయాకర్‌రావు. తాను కూడా గెలుస్తానో లేదో అన్న అనుమానం కూడా వ్యక్తం చేశారట. అందుకే… 30 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చి.. కొత్త అభ్యర్థులను ప్రకటిద్దామని చెప్పారట ఎర్రబెల్లి. కానీ… అందుకు కేసీఆర్‌ ససేమిరా అన్నారట. తన మాట చెవిలో పెట్టుకోకుండా… పాత అభ్యర్థులనే ప్రకటించేశారట. పాలకుర్తిలో తనకు కూడా టికెట్ ఇవ్వొద్దని చెప్పినా…. తననే బరిలోకి దించారట. అదే కొంపముంచిదని అంటున్నారు ఎర్రబెల్లి దయాకర్‌రావు. అభ్యర్థులను మార్చుంటే… గెలిచే అవకాశాలు మెండుగా ఉండేవట. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను ఓడిపోతే… మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారని అన్నారు ఎర్రబెల్లి.


Also Read : కోమటిరెడ్డిపై జానారెడ్డి రాజకీయం..రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవికి జానా ఎర్త్‌..!


అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ వదులుకోలేదు కనుకే… ప్రజలు ఆయన్ను వదిలేశారని అన్నారు. అయినా… ఒక్కోసారి ఓటమి కూడా మంచిచేస్తుందని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది… బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ విలువ ఇప్పుడు ప్రజలు తెలిసొచ్చిందని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని అన్నారు ఎర్రబెల్లి. ఈనెల 27న వరంగల్‌లో నిర్వహిస్తున్న సభకు పెద్దసంఖ్యలో తరలిరావాలని… కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 100, 200 రూపాయలు ఇస్తే వస్తారని కాకుండా.. కార్యకర్తలు ముందుండి ప్రజలను తీసుకురావాలన్నారు.

ఇవి కూడా చదవండి .. 

  1. సూర్యాపేటలో ఫేక్ హాస్పిటల్.. డాక్టర్ పై ఫోర్జరీ కేసు

  2. నిండు గర్భిణి.. కొన్ని గంటల్లో పుట్టబోయే బిడ్డ – అబ్బా.. ఎంత దారుణంగా చంపాడో..!

  3. అమెరికా యూనివర్శిటీలో కాలులు.. రంగంలోకి డొనాల్డ్ ట్రంప్

  4. సీఎం రేవంత్ రెడ్డికి గండం!సుప్రీంకోర్టుకు సీఈసీ సంచలన రిపోర్ట్

  5. ఏపీలో లిక్కర్‌ స్కామ్‌ – హైదరాబాద్‌లో హడావుడి – కసిరెడ్డి నుంచి దారి జగన్‌ వైపుకా..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button