తెలంగాణరాజకీయం

జూబ్లీహిల్స్‌ బైపోల్‌పై కవిత ఫోకస్‌ – జాగృతి పేరుతో పోటీ చేసే ఛాన్స్‌

Telangana Jagruti : తెలంగాణ రాజకీయాల్లో కవిత ఒక సునామీనే సృష్టించారని చెప్పొచ్చు. సొంత పార్టీ నేతలు, బంధువులు అయిన హరీష్‌రావు, సంతోష్‌రావుపై తీవ్ర విమర్శలు చేసి… పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యారు కవిత Kavitha. అంతటితో ఆగలేదు.. నాన్న జాగ్రత్త… రామన్న జాగ్రత్త అంటూ… మీకూ నా పరిస్థితే రావొచ్చు అంటూ కేసీఆర్‌, కేటీఆర్‌కు కొన్ని సూచనలు చేశారు. అది అలా ఉంచితే… బీఆర్‌ఎస్‌కు దూరమైన కవిత… ఇప్పుడు ఏం చేయబోతున్నారు..? ఏ పార్టీలో చేరబోనని స్పష్టంగా చెప్పారామె. అంటే కొత్త పార్టీ పెట్టబోతున్నారా..? పార్టీ పెట్టడం సులువే… నడిపించడం, గెలిపించడమే కష్టం. మరి కష్టతరమైన ఆ మార్గంలోనే కవిత పొలిటికల్‌ జర్నీ కొనసాగబోతోందా…? ఆమె ఆలోచన ఏంటి…? ఆచరణ ఏంటి…?

కొన్ని నెలలుగా బీఆర్‌ఎస్‌లోని కొందరు నేతలను పరోక్షంగా విమర్శిస్తూ వచ్చిన కవిత… కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ వేసిన తర్వాత బరస్ట్‌ అయ్యారు. డైరెక్ట్‌ అటాక్‌లోకి దిగారు. గతంలో కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలు ఉన్నాయన్న ఆమె… ఆ దెయ్యాలు ఎవరో బయటపెట్టేశారు. హరీష్‌రావు, సంతోష్‌రావుపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌ అవినీతి మరక అంటడానికి వారిద్దరే కారణమని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అవినీతి జరిగితే.. అందుకే హరీష్‌రావే బాధ్యుడని చెప్పకనే చెప్పేసింది. కేసీఆర్‌ పరువు పోతుందటే పార్టీ ఉంటే ఎంత..? పోతే ఎంత అని కూడా అనేశారామె. కవిత కామెంట్లతో బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేశాయి కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత మాటలతో తేలిపోయిందన్నాయి. దీంతో.. బీఆర్‌ఎస్‌ భగ్గుమంది. కన్న కూతురని కూడా చూడకుండా… కేసీఆర్‌ పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేశారు. దీంతో.. కవిత మరింత ఓపెన్‌ అయ్యారు. హరీష్‌రావు, సంతోష్‌రావుల అవినీతి బాగోతాలను మీడియా ముందు పెట్టారు. హరీష్‌రావు డెయిరీ డీలింగ్స్‌… సంతోష్‌రావు హరితహారం పేరుతో చేసిన అవినీతి అంతా కక్కేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై కూడా ఆమె హాట్‌ కామెంట్స్‌ చేశారు. Phone typing ఫోన్‌ ట్యాంపింగ్‌కు కారకులు కూడా హరీష్‌రావు, సంతోష్‌రావు, శ్రవణ్‌రావే అని ఆరోపించారు. ఇందులో కేటీఆర్‌కు చెందిన వారు కూడా బాధితులుగా ఉన్నారని అన్నారామె. అంతేకాదు.. తమ కుటుంబంలో నలుగురికి నోటీసులు వచ్చినట్టు చెప్పారు. ఇక.. ఎన్నికల్లో తనను, కేటీఆరే కాదు.. కామారెడ్డి కేసీఆర్‌ ఓటమి వెనుక కూడా హరీష్‌రావు హస్తముందని సంచలన ఆరోపణలు చేశారు.

మొత్తంగా… బీఆర్‌ఎస్‌కు దూరమయ్యారు కవిత. ఇప్పుడు ఏం చేయబోతున్నారు..? కొత్త పార్టీ పెడతారా..? లేక ఇండిపెండెంట్‌గా ఉంటూనే బీఆర్‌ఎస్‌ను ఇరుకున పెడతారా…? కొత్త పార్టీ పెట్టడం ఇప్పటికిప్పుడు జరిగే పరిస్థితి కాదు.. దానికి కొంత టైమ్‌ పడుతుంది. అప్పటి వరకు కవిత ఏం చేయబోతున్నారు..? ఆమె తక్షణ కర్తవ్యం ఏంటి…? అంటే… జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై ఆమె ఫోకస్‌ పెట్టినట్టు సమాచారం. జూబ్లీహిల్స్‌… బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానం. ఇక్కడ గెలుపుకోసం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ పోటాపోటీగా తలపడుతున్నాయి. ఇప్పుడు.. ఆ స్థానంపై కవిత ఫోకస్‌ పెట్టినట్టు సమాచారం. కొత్త పార్టీ పెట్టకపోయినా… జాగృతి పేరుతో బైపోల్‌లో ఆమె పోటీచేయాలని ఆమె భావిస్తున్నారట. అందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తున్నారట కవిత. అన్నీ కుదిరితే.. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నుంచే… సొంతంగా రాజకీయ అరగ్రేటం చేయాలన్నది ఆమె ప్లాన్‌ అని కవిత వర్గీయులు చెప్తున్నారు. అయితే… జూబ్లీహిల్స్‌ బైపోల్‌లో గెలుపు తన ఈజీ కాదు. కానీ.. సాధిస్తే మాత్రం ఆమె గ్రాఫ్‌ అమాంతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఓడిపోయినా.. ఓట్లను మాత్రం చీల్చగలుగుతారు కవిత. దీని వల్ల.. బీఆర్‌ఎస్‌కు భారీ నష్టం తప్పదు. అంటే… ఈ బైపోల్‌లో గెలిచినా, ఓడినా.. కవితకు ప్లస్సే అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి.. కవిత ఏం స్టెప్‌ తీసుకుంటారో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button