తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కెసిఆర్ కూతురు,బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను నిండా ముంచారని తీవ్రంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం అవుతున్న కూడా చాలా హామీలను నెరవేర్చకపోవడం మీ ప్రభుత్వం చేతకాని పని అని మండిపడ్డారు.
వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్!… కొత్త స్కాన్ ఏర్పాటు?
ఇప్పటికీ సంవత్సరం పూర్తిగావస్తున్న కూడా ప్రజలకు ఎటువంటి రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయలేదని అన్నారు. అలాగే రాష్ట్రంలో రైతులు పండించేటువంటి పంటలకు సరైన మద్దతు ధరలు ప్రభుత్వం కల్పించకపోవడం వల్లే ఇవ్వాలా చాలామంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు. సరిగా రుణమాఫీ కూడా కాలేదు అంటూ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. రైతు భరోసా కూడా ఇంకా పంపిణీ చేయకపోవడం ప్రభుత్వం చేతగానితనం అని అన్నారు.
తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!…
ప్రతి సంవత్సరం అందించేటువంటి క్రిస్మస్ గిఫ్ట్లు, బతుకమ్మ చీరలు, రంజాన్ పండగలు వంటివి పట్టించుకోవడం పూర్తిగా మానేశారు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. మహిళలకు ఇస్తామన్నా 2500 రూపాయల హామీ ఎక్కడికి పోయిందంటూ , ఆడపిల్లలకు ఇస్తామన్నటువంటి స్కూటీలు కూడా ఇంకా ఇవ్వలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని తనమని కాంగ్రెస్ ప్రభుత్వం పై అలాగే సీఎం రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు.