Tuesday, February 17, 2026
Homeతెలంగాణఎన్నో విమర్శల వేల కేసిఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపిన కవిత

ఎన్నో విమర్శల వేల కేసిఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపిన కవిత

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ పుట్టినరోజు సందర్భంగా అతని కూతురు కవిత సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ తెలిపారు. గత కొంతకాలం నుంచి కెసిఆర్ కు దూరంగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీ నుంచి వైదొలిగిపోయి ఇరువురి మధ్య ఎన్నో విమర్శలు అలాగే వైరాలు ఉన్న నేపథ్యంలో కవిత బర్త్డే విషెస్ తెలపడం ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తుంది. రాజకీయాలను పక్కనపెడితే సొంత తండ్రికి కవిత ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “రాష్ట్ర ఉద్యమ నాయకులు,గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు” అంటూ ఆమె చాలా సాదాసీదాగా ట్విట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో కాస్త చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే సొంత తండ్రి అయినప్పటికీ కూడా రాజకీయపరంగా ట్వీట్ చేయడం అనేది రాజకీయ వర్గాల్లో కాస్త చర్చకు దారి తీసింది. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ తో పాటు కేసీఆర్ పైన కూడా కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ ఈరోజు తన తండ్రి బర్త్డే సందర్భంగా ట్విట్ చేయడం కాస్త ఆశ్చర్యపరిచింది. ఇంకోవైపు కేసీఆర్ బర్త్డే కానుకగా ఇప్పటికే ప్రముఖ రాజకీయ నాయకులు అలాగే సినిమా సెలబ్రిటీలు అందరూ కూడా కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పటికే కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

క్యాతనపల్లిలో 163 బి ఎన్ ఎస్ ఎస్ అమలు.. రెండు రోజులపాటు గుంపుల నిషేధం,ర్యాలీలకు బ్రేక్

యాదగిరిగుట్ట,ఆలేరులో మున్సిపల్ ఛైర్మన్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments