
మద్దూర్ ప్రతినిధి, ఏప్రిల్ 22 (క్రైమ్ మిర్రర్):- నారాయణపేట జిల్లా మద్దూర్ మండల పరిధిలోని కస్తూరిబా ఇంటర్ విద్యార్థులు ప్రవేట్ కళాశాల కంటే ముందుగా ప్రతిభ కనబరిచారు. మొదటి సంవత్సరం ఎంపీసీ 470 మార్కులకు 450 మార్కులు సాధించిన విద్యార్థిని రామేశ్వరి, బైపిసి విద్యార్థి నందిని 440 మార్కులకు 429 మార్కులు సాధించింది. వీరిని కేజీబీవీ ప్రిన్సిపాల్ గౌరమ్మ అభినందించారు నారాయణపేట జిల్లాలో కస్తూర్బా పెదిలిపాడు కళాశాలకు గౌరవం తీసుకొచ్చారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.