
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సరికొత్త సినిమా K-RAMP. చాలా రోజుల తర్వాత కిరణ్ అబ్బవరం ఒక డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఇక ఈ సినిమా నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక సినిమా రివ్యూ విషయానికి వస్తే… ఒక అల్లరి చిల్లరిగా తిరిగే కోటీశ్వరుడు కొడుకు కాలేజీలో ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేశాడనేది ఈ సినిమా. ఆ యువతి ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటుందో… ఆ సమస్యలన్నిటిని కూడా కిరణ్ అబ్బవరం ఎలా తీర్చాడనేదే ఈ సినిమా పూర్తి కథ. ఇక ఈ సినిమాలో హీరోగా కిరణ్ అబ్బవరం నటన సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఇక సినిమాలోని కామెడీ సీన్లు అలాగే మాస్ సీన్లు అయితే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మరోవైపు పాటలు అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించినా కూడా కొత్తదనం లేని కథతో డైరెక్టర్ కాస్త వెనకబడ్డాడు. ఎక్కువగా కామెడీ సీన్లు ఇరికించినట్లుగా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఈ సినిమాలో బిగ్ మైనస్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా డబల్ మీనింగ్ డైలాగ్స్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఎక్కువగా డబల్ మీనింగ్స్ కాస్త ప్రేక్షకులను ఇబ్బంది పెట్టేలా కనిపించాయి. ఇక ఓవరాల్ గా సినిమా అయితే బాగుందని చెప్పవచ్చు. వీకెండ్ కావడంతో ఈ సినిమా కలెక్షన్లలో దూసుకుపోయే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
K-RAMP రేటింగ్ 2.75/5
Read also : వర్షపు ముప్పులో ఆస్ట్రేలియా సిరీస్.. ఎవరికి అనుకూలం?
Read also : సదర్ సందడి 2025… యాదవ సోదరుల ఉత్సాహం