
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైడ్రా తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. హైడ్రా పేదలకు ఒక న్యాయం.. పెద్దలకో న్యాయం.. అనే నినాదంతో కూల్చివేతలు కొనసాగిస్తుంది అని కేటీఆర్ ఆరోపించారు. తాజాగా బీఆర్ఎస్ భవన్ లో పార్టీ కీలక నేతలతో పాటు ప్రజలతో మాట్లాడుతూ హైడ్రా అరాచకాల పై పీపీటీ ప్రదర్శించారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నేతలకు సంబంధించి పలు ముఖ్య నాయకుల భవనాలను హైడ్రా కూల్చివేయకుండా కేవలం పేదల ఇళ్లను మాత్రమే కూల్చివేస్తుంది అని వివరించారు. పేదలు ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో ఇళ్లను కట్టుకుంటే… వాటిని కూలగొట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు అని ఫైరయ్యారు.
Read also : తుఫాన్, తొక్కిసలాట ఘటనను పక్కద్రోవ పట్టించడానికే అరెస్టు చేశారు : జగన్
FTL పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలు కూలుస్తాము అని చెప్తున్నటువంటి హైడ్రా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంటిని కూల్చే ధైర్యం ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటితోపాటు చాలామంది కాంగ్రెస్ నాయకులు ఇల్లు అక్రమ స్థలాల్లో కట్టుకున్నారు. వాటన్నిటినీ కూల్చే దమ్ము హైడ్రాకి ఉందా అని సవాల్ విసిరారు. ఈ విషయంలోనే నాయకులకు ఒక న్యాయం జరుగుతుంది.. సామాన్యులకు అన్యాయం జరుగుతుంది అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు పేదల పొట్ట కొడుతున్నారు అని తీవ్రంగా మండిపడ్డారు. కనీసం సామాన్యులు కోర్టుకు వెళ్లి ఇది పరిస్థితి అని చెప్పుకోవడానికి కూడా సమయం లేకుండా పోయింది అని తెలిపారు. కచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో మళ్లీ మన కెసిఆర్ పాలనే వస్తుంది అని.. కచ్చితంగా హైడ్రా ద్వారా ఎవరైతే నష్టపోయారో ఆ బాధితులు అందరికి కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అని కేటీఆర్ హామీ ఇచ్చారు.
Read also : తెలంగాణలో నేడు, రేపు ఈ జిల్లాలో భారీ వర్షాలు





