
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :-
ఇజ్రాయిల్ మరియు హమాస్ మధ్య ఇప్పటికే ఎన్నోసార్లు సీజ్ ఫైర్ ఉల్లంఘనలు జరిగాయి. మళ్లీ నిన్న ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఏకంగా 27 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. హమాస్ సీజ్ ఫైర్ ఉల్లంఘనకు పాల్పడుతుంది అన్న కారణంగానే ఇటువంటి దాడులు చేస్తున్నామని ఇజ్రాయిల్ చెప్పడం గమనార్హం. ఏది ఏమైనా కూడా ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో గాజాలు 14 మంది అలాగే యూనిస్ లో మరో 13 మంది మరణించినట్లు సమాచారం. ఇప్పుడిప్పుడే మెల్లిగా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి అని అనుకున్న సందర్భంలో మరోసారి ఇజ్రాయిల్ దాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయని గాజా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఎప్పుడు ఎప్పుడు దాడులు జరుగుతాయో.. ఎలా ఈ సమస్యల నుంచి బయట పడాలి అని ప్రజలందరూ కూడా భయపడుతూనే ఆలోచనలు మొదలుపెట్టారు. హమాస్ కనుక సీజ్ ఫైర్ ఉల్లంఘనకు పాల్పడకుండా ఉంటే ఇటువంటి దాడులు జరగవు అని ఇజ్రాయిల్ చెబుతోంది. కానీ పదేపదే ఇజ్రాయిల్ మరియు హమాస్ మధ్య ప్రతిసారి సీజ్ ఫైర్ ఉల్లంఘన జరుగుతుంది. దీంతో ఎంతోమంది అమాయకుల ప్రాణాలు ఈ దాడులలో బలవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ ఇరుదేశాల మధ్య దాడులు మరింత వైరల్ గా మారుతున్నాయి.
Read also : హైదరాబాదుకు చేరుకున్న జగన్.. చూసేందుకు ఎగబడ్డ జనం!
Read also : New Aadhaar: త్వరలో కొత్త ఆధార్.. దీని ప్రత్యేక ఏంటంటే?





