
క్రైమ్ మిర్రర్, క్రైమ్ న్యూస్ :- ఈ మధ్య నేరుగాలు కొత్త పద్ధతులతో, కొత్త టెక్నాలజీలతో సామాన్య ప్రజలను మరింత మోసం చేయడానికి పని కట్టుకొని కూర్చున్నారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాలిపోవాలని చూస్తున్నారు. కేవైసీ అప్డేట్ అనే పేరుతో వచ్చేటువంటి కాల్స్, లింక్స్ లేదా మెసేజెస్ వంటివి వస్తే వాటికి ఎవరు కూడా స్పందించకండి. ఎందుకంటే అవే మనల్ని నిట్ట నిలువున ముంచేయవచ్చు. మన వివరాలను అనధికారికంగా ఉపయోగించి.. నేరాలకు కూడా పాల్పడవచ్చు.
Read also : ఘనంగా కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు
ఎలా తప్పించుకోవాలో తెలుసుకోండి?..
ఈ కాలంలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు చాలా సులభంగా అందుతున్నాయి. కాబట్టి ఇదే సమయంలో చాలామంది మోసగాళ్లు మోసాలు చేయడానికి కూడా వెనుకాడట్లేదు. బ్యాంక్ ఖాతా నుంచి, మొబైల్ నెంబర్ల వరకు కూడా ఇప్పట్లో ప్రతి ఒక్కటి కేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి వీటిని మోసగాళ్లు క్యాష్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. వెంటనే మన ఫోన్ నెంబర్స్ కు కాల్ చేసి మేము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాము… మీకు పంపిన కేవైసీ లింకును ఉపయోగించి మీరు అప్డేట్ చేసుకోండి అని మెసేజెస్ రూపంలోనూ, కాల్స్ రూపంలోనూ సైబర్ నేరగాళ్లు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి కొంత అవగాహనతో అలాగే జాగ్రత్తగా ఉంటే వీటి నుంచి మనం సులభంగా తప్పించుకోవచ్చు. చదవడం రాని వారు ఎవరైనా తెలిసిన వాళ్ల చేత లేదా చదువుకున్న వాళ్ళ చేత మాట్లాడించడం మంచిది. కాబట్టి ఇలాంటి సైబర్ మోసగాళ్ల పట్ల ప్రతి ఒక్కరూ తస్మాత్ జాగ్రత్తగా ఉండండి.
Read also : తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద భక్తుడిపై ఆటో డ్రైవర్ల దాడి.. భక్తుల్లో ఆగ్రహం!