ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ

జైలు నుండి వచ్చిన తర్వాత ఫ్యామిలీని చూసి ఏడ్చిన జానీ మాస్టర్!

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈమధ్య ఒక లైంగిక వేధింపు కేసులో జైలుకు వెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ జానీ మాస్టర్ 37 రోజుల జైలు జీవితం తర్వాత బయలు పై బయటకు వచ్చాడు. గత కొన్ని నీళ్లుగా తనను జానీ మాస్టర్ వేధిస్తున్నాడని మతం మార్చుకోమని టార్చర్ పెడుతున్నాడని సదరు డాన్సర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. మొదటిసారి ఆయనకు బెయిల్ కోరగా అది నిరాకరించారు కోర్టు వాళ్ళు. రెండోసారి కూడా తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని బెయిల్ అప్లై చేయగా అప్పుడు కూడా రాలేదు.

మూడవసారి బెయిల్ కోరగా అక్టోబర్ 25వ తారీకు జానీ మాస్టర్ బయటకు వచ్చాడు. తాజాగా జానీ మాస్టర్ సోషల్ మీడియాలో ఒక వీడియో పంచుకున్నాడు. ఈ వీడియోలో జైలు నుంచి ఇంటికి రాగానే కన్నబిడ్డలు తండ్రిని పట్టుకొని ఏడుస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో స్పష్టంగా కనిపించాయి. జానీ మాస్టర్ తలుపు తెరవగానే ఆయన కొడుకు అలాగే ఫ్యామిలీ మొత్తం అతన్ని చుట్టుముట్టి గట్టిగా అతుక్కున్నారు. దాంతో ఒక్కసారిగా జానీ మాస్టర్ కూడా బాగోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button