ఆంధ్ర ప్రదేశ్

ప్రతి నెలా.. ప్రతి నియోజకవర్గంలో.. జాబ్ మేళాలు నిర్వహించాలి : సీఎం చంద్రబాబు

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెల జాబ్ మేళాలు నిర్వహించాలి అని ఉన్నత అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పించే విధంగా అధికారులు కూడా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. తాజాగా నైపుణ్య అభివృద్ధి శాఖపై సమీక్షించిన సీఎం “నైపుణ్యం” పోర్టల్ ఉద్యోగాల గేట్వేగా ఉండాలి అని కోరారు. వచ్చేనెల నవంబర్ లో జరగబోయేటువంటి కీలక సదస్సులో పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం అధికారులకు కొన్ని సూచనలు చేశారు.

Read also : తెలంగాణ ముంపు ప్రాంతాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే జాబ్ మేళాల ద్వారా లక్ష నలభై నాలుగు వేల మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకి వివరించారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఇలానే ప్రతి నెల కూడా ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగాన్ని తగ్గించే విధంగా అధికారులు కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తగ్గించే విధంగా కూటమి ప్రభుత్వం సర్వశక్తుల ప్రయత్నాలు చేస్తుంది అని తెలిపారు. అందుకు తగ్గట్టుగానే అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఉన్నత కంపెనీలతో చర్చించి జాబ్ మేళాలు నిర్వహిస్తూ యువతకు ధైర్యం ఇవ్వాలని తెలిపారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ ద్వారా ఏకంగా 16,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు డీఎస్సీ ద్వారా ఉద్యోగాలను ఇప్పించారు. ఏపీ మెగా డీఎస్సీ సక్సెస్ అయినట్టుగానే జాబ్ మేళాలు కూడా నిర్వహించి యువతకు ప్రభుత్వంపై నమ్మకం వచ్చే విధంగా పనిచేయాలని సూచించారు.

Read also : అమెజాన్ లో లక్ష రూపాయలకు పైగా ఫోన్ ఆర్డర్ చేసిన వ్యక్తికి చేదు అనుభవం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button