అంతర్జాతీయంవైరల్

యూధులకే ఎక్కువ నోబెల్ అవార్డులు.. కారణం ఏంటి?

క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :- తాజాగా విడుదల చేసినటువంటి నోబెల్ బహుమతి వెనుజులా కు చెందిన మరియా కొరినా మచాడో కు వరించిన విషయం మనందరికీ తెలిసిందే. మరోవైపు ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి డోనాల్డ్ ట్రంప్ కు నిరాశ ఎదురయింది. అయితే ప్రపంచవ్యాప్తంగా 0.2% మాత్రమే ఉన్న యూధులు ఏకంగా 22 శాతం నోబెల్ బహుమతులు గెలుచుకున్నారు. వివిధ రంగాలలో సత్తా చాటుతూ వీరికే ఎక్కువ నోబెల్ బహుమతులు రావడం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ అలాగే మెడిసిన్ ఇలా ఎన్నో రంగాల్లో యూధులు సత్తా చాటుతూ అతి ప్రతిష్టాత్మకమైనటువంటి నోబెల్ బహుమతులు పొందారు . ఇందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలిసిన ఐన్ స్టీన్, ఓపెన్ హైమర్, మార్క్ జుకర్ బర్గ్, ఆల్ట్ మన్, స్టీవెన్ స్పిల్ బర్గ్ వీరందరూ కూడా యూధులు మతానికి చెందిన వారే. వీరిలో ముఖ్యంగా ఐన్ స్టీన్ అలాగే ఓపెన్ హైమర్ ల గురించి చాలా సందర్భాల్లో వినుంటారు. ఈ యూధులు అనే మతానికి సంబంధించిన వారు అన్ని రంగాల్లో సత్తా చాటారు. ఎందుకంటే ఈ మతాల వారికి వివిధ దేశాల్లో ఎన్నెన్నో అవమానాలు అలాగే బహిష్కరణలు ఎదుర్కోవడంతో ఏదో సాధించాలన్న కసి ఉండడం ద్వారా నేడు అతిప్రతిష్టమైనటువంటి నోబెల్ బహుమతులు పొందారు. దాదాపు నోబెల్ బహుమతులు 22% ఈ మతాలు వారే పొందడం నిజంగా ప్రశంసించాల్సిన విషయమే. మరోవైపు నోబెల్ బహుమతి కోసం 332 మంది నామినేషన్లు దాఖలు చేయగా… వెనిజులాగు చెందిన మచాడోకు ఆ పురస్కారం వరించింది.

Read also : బ్రేకింగ్ న్యూస్.. క్యాన్సర్ లక్షణాలు ఇవే?

Read also : ముఖ్యమంత్రి రేవంత్ కి సవాలుగా మరీనా మరో మంత్రుల వివాదం…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button