
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర గీతం అయినటువంటి జయ జయహే తెలంగాణ అనే పాటను సృష్టించినటువంటి సృష్టికర్త అందె శ్రీ ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. అయితే మొదట స్పృహ తప్పి పడిపోగా.. కుటుంబ సభ్యులు వెంటనే దగ్గరలోని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 7:25 నిమిషాలకు గుండెపోటుతో మరణించారు. గత నాలుగు రోజుల నుంచి ఈ సృష్టికర్త తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జయ జయహే తెలంగాణ అంటూ తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి అందె శ్రీ గొంతు ఇక వినలేని పరిస్థితి. ఇప్పటినుంచి ఆయని గాత్రము ఎవరూ కూడా వినలేం. జన జాతరలో మన గీతం అంటూ, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, పల్లె నీకు వందనాలమ్మో అంటూ దద్దరిల్లించినటువంటి కంఠం ఇక కనుమరుగయింది. తన రచనలతో అలాగే తన గాత్రంతో సమాజాన్ని జాగ్రత్తపరిచిన అందె శ్రీ మరణించడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు అతనికి నివాళులర్పిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు నూటికి లేక కోటికి ఒకడుంటారు అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా అతనిపై ప్రశంసలు కురిపిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులతో పాటుగా దేశవ్యాప్తంగా పలువురు మంత్రులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read also : పాస్వర్డ్ గట్టిగా లేదంటే అంతే సంగతులు?.. జరభద్రం!
Read also : ఓటుకు కాంగ్రెస్ 5000 , బీఆర్ఎస్ 7000.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు ?





