క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 116 మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. జనగామ, తొర్రూరు వంటి కొన్ని మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో (హంగ్) స్వతంత్రులు మరియు లాటరీ పద్ధతి కీలకంగా మారాయి.
చైర్మన్ ఎంపిక ప్రక్రియలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ మరియు తొర్రూరు మున్సిపాలిటీలను చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగింది. ఓట్లు సమానంగా రావడంతో అధికారులు లాటరీ పద్ధతిని పాటించారు. ఈ లక్కీ డ్రాలో మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ అభ్యర్థిలు దక్కించుకున్నారు.
