
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతుంది. పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన తరువాత మొట్టమొదటిసారిగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమా కాబట్టి ఒకవైపు సినిమా పరంగా పవన్ కళ్యాణ్ అభిమానులు మరోవైపు రాజకీయపరంగా జనసేన పార్టీ అభిమానులు మరియు ఎమ్మెల్యేలు అందరు కూడా పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నారు. అయితే తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చాలా కొత్తగా వ్యవహరించారు.
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
తిరుపతి జనసేన ఎమ్మెల్యే శ్రీనివాసులు హరిహర వీరమల్లు సినిమా సూపర్ సక్సెస్ కావాలని తిరుమల తిరుపతి దేవస్థాన అలిపిరి మెట్ల వద్ద కొబ్బరికాయలు కొట్టి మరీ కోరుకున్నారు. ప్రతి ఒక్క జనసేన కార్యకర్త అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ఈ హరిహర వీరమల్లు సినిమాని విజయవంతం చేయాలని… పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా కాబట్టి… అలాగే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏదో ఒక గొప్ప సందేశం ఇవ్వబోతున్నారని జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. దీంతో ఒక హీరో సినిమా అంటే ఆ హీరో అభిమానులు లేదా ఆ హీరో యొక్క కుటుంబం… సినిమా సక్సెస్ కావాలని హారతులు, దైవాలకు పూజలు చేస్తూ ఉండడం మనం చాలా సందర్భాల్లో చూసాం. మొట్టమొదటిసారిగా ఒక సినిమా విడుదలవుతుండగా ఒక ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టి మరి సక్సెస్ కావాలని కోరుకోవడం ఇదే మొదటి సారి అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
4వ టెస్ట్ మ్యాచ్ కు దూరమైన తెలుగు కుర్రోడు.. రానున్న బూమ్రా!