
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదవ టెస్టు మ్యాచ్ లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీ చేశారు. ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నా కూడా మరోవైపు యశస్వి జైష్వాల్ నిలదొక్కుకొని చక్కటి షాట్లతో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. అనవసరపు షాట్లు ఆడకుండా.. చక్కగా సింగిల్స్ తీస్తూ సెంచరీని పూర్తి చేశారు. ఇంగ్లాండ్ గడ్డపై యశస్వి జైస్వాల్ ఇప్పటివరకు నాలుగు సార్లు సెంచరీలు చేశారు. మొత్తంగా ఇంగ్లాండ్ పై ఇది ఆరవ సెంచరీ. యశస్వి జైష్వాల్ చేసిన సెంచరీలో మొత్తం 11 ఫోర్లు మరియు రెండు సిక్సులు ఉన్నాయి. 80 స్ట్రైక్ రేట్ తో యశస్వి జైస్వాల్ సెంచరీని పూర్తిచేసుకున్నారు. ప్రస్తుతం ఐదవ టెస్టు మ్యాచ్ మూడో రోజు కొనసాగుతూ ఉంది.
Read also : సమంతపై నిరాధార ఆరోపణలు, మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్!
ప్రస్తుతం భారత్ స్కోర్ 250 వద్ద నిలకడగా కొనసాగుతున్నారు. రెండవ ఇన్నింగ్స్ కే ఎల్ రాహుల్ 7, సాయి సుదర్శన్ 11, ఆకాశదీప్ 66, గిల్ 11, కరుణ్ నాయర్ 17 పరుగులకు అవుట్ అయ్యారు. ప్రస్తుతం యశస్వి జైస్వాల్ 116, రవీంద్ర జడేజ 17 పరుగులతో భారత్ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్తున్నారు. కాగా ఇప్పటికే జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్ లలో రెండు ఇంగ్లాండ్ 1 భారత్ గెలిచాయి. మరో టెస్ట్ డ్రాగ ముగిసింది. ఇప్పుడు జరుగుతున్న ఐదవ టెస్టు మ్యాచ్లో ఇండియా గెలిస్తే టెస్ట్ సిరీస్ డ్రాగ ముగిస్తుంది. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే టెస్ట్ సిరీస్ కైవసం చేసుకుంటుంది.
Read also : కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు