
-
విద్యార్థి దశ నుంచి రాజకీయంగా ఎలా ఎదిగారో..
-
ఎన్ని ఇబ్బందులు పడ్డారో..
-
ఎన్ని కుట్రలను ఛేదించారో… అన్నీ ఆ సినిమాతో కళ్లకు కట్టబోతన్నారు.
-
జగ్గారెడ్డి తన పాత్రలోనే నటిస్తున్నాడు.
రాజకీయ నాయకుడు తెరంగేట్రం చేస్తున్నాడు. త్వరలోనే వెండితెరపై కనిపించబోతున్నాడు. తన జీవితాన్నే సినిమాగా తీస్తూ… తన పాత్రలో తానే నటిస్తున్నాడు. ఆ సినిమా టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. ఉగాది రోజు రిలీజైన ఆ టీజర్ చూసిన వారంతా… అదిరిందయ్యా… జగ్గారెడ్డి అంటున్నారు.
తూర్పు జగ్గారెడ్డి.. ఈయనకు తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అవసరం లేదు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే. ఈయన తన జీవిత కథను తెరపైకి ఎక్కిస్తున్నారు. విద్యార్థి దశ నుంచి రాజకీయంగా ఎలా ఎదిగారో.. ఎన్ని ఇబ్బందులు పడ్డారో.. ఎన్ని కుట్రలను ఛేదించారో… అన్నీ ఆ సినిమాతో కళ్లకు కట్టబోతన్నారు. ఈ సినిమాకు జగ్గారెడ్డి.. ఎ వార్ ఆఫ్ లవ్ అని పేరు పెట్టారు. ఈ సినిమాలో జగ్గారెడ్డి తన పాత్రలోనే నటిస్తున్నాడు. అంతేకాదు.. కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ కూడా స్వయంగా చూసుకుంటున్నారు. ఉగాది సందర్భంగా సినిమా ఆఫీసును కూడా ప్రారంభించారు.
Also Read : భట్టి విక్రమార్కకు ప్రమోషన్ – డ్రాఫ్టింగ్ కమిటీలో చోటు
తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ‘జగ్గారెడ్డి.. ఏ వార్ ఆఫ్ లవ్’ సినిమాలో చూపించబోతున్నట్టు చెప్పారు జగ్గారెడ్డి. విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ జీవితం మొదలైందని… ఆ ప్రయాణం రాష్ట్ర నేత అయ్యే వరకు వచ్చిందన్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు, ట్విస్ట్‌లు ఉన్నాయని చెప్పారు. అవన్నీ… సినిమాలో ఉంటాయన్నారు. సాధారణంగా సినిమా హీరోలు… ఎవరో రాసిన కథల్లో నటిస్తుంటారని… పోలీసులను కొట్టినట్టు… ఫైటింగ్‌లు చేసినట్టు యాక్టింగ్ చేస్తారన్నారు. కానీ… తన జీవితంలో అవన్నీ నిజంగానే జరిగాయని.. అదే ఈ సినిమాలోనూ ఉంటుందన్నారు జగ్గారెడ్డి.
తనపై రూపొందించిన పోస్టర్‌ను తనను చాలా ఆకట్టుకుందన్నారు జగ్గారెడ్డి. రాజకీయ జీవితంలో తాను పడ్డ కష్టాలు.. వచ్చిన విజయాలన్నీ ఈ సినిమాలో చూపిస్తానన్నారు. మొత్తంగా.. జగ్గారెడ్డి పోస్టర్‌తో వచ్చిన టీజర్ మాత్రం అదిరింది.
ఇవి కూడా చదవండి ..
-
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎంఐఎందేనా..? – పోటీకి ముందుకు రాని ప్రధాన పార్టీలు
-
16 రోజులు జైల్లో నరకం చూశా- సీఎం రేవంత్‌రెడ్డి భావోద్వేగం
-
వైఎస్ షర్మిలపై పెరుగుతున్న వ్యతిరేకత- కాంగ్రెస్‌ను వీడుతున్న కడప నేతలు
-
కాశీనాయన క్షేత్రం కాంట్రవర్సీ – పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన జగన్
-
టీడీపీకి కనిపించని శత్రువు పవనే..! – ఈ సత్యం చంద్రబాబు గ్రహించేదెప్పుడో..?