
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు అనకాపల్లి పర్యటనపై చాలానే వివాదాలు కొనసాగుతున్నాయి. కానీ జగన్ రోడ్ షో కు పోలీసులు కొన్ని షరతులతో కూడిన అనుమతి అయితే ఇచ్చారు. మరోవైపు జగన్ విమానాశ్రయం నుంచి మాకవరపాలెం మెడికల్ కాలేజ్ వరకు కూడా రోడ్ షో చేసేందుకు వైసీపీ పార్టీ శ్రేణులు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఇంత దూరం రోడ్ షో చేయడానికి పోలీసులు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా మకవరపాలెం వద్దకు హెలికాప్టర్ వెళ్లేందుకు అనుమతులు ఇస్తామని పోలీసులు తెలియజేశారు. కానీ వైసీపీ నేతలు మాత్రం జగన్ పర్యటన ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగి తీరుతుంది అని చెప్తున్నారు.
Read also : మైనర్ బాలిక హత్య కేసు – దూకుడు పెంచిన డీఎస్పీ శివరాం రెడ్డి
జగన్ నేడు మాకవరపాలెం మెడికల్ కాలేజీ సందర్శనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్లు పోలీసులు భద్రత విషయంలో తగిన ఏర్పాట్లను చేయాలని వైసీపీ నేతలు పోలీసులకు లేఖలు రాశారు. మరోవైపు విశాఖపట్నంలో మహిళల వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో భద్రత గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు. దీంతో ప్రతి ఒక్కరు కూడా కరూర్ లో విజయ సభలో జరిగినటువంటి తొక్కిసలాట తెరపైకి వచ్చింది. అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా భద్రత కల్పించాలని వైసీపీ నేతలు మరోవైపు ప్రజలు కోరగా… ఒకవైపు మహిళల వరల్డ్ కప్ మరోవైపు జగన్ పర్యటనకు పెద్ద ఎత్తున భద్రత కల్పించాలంటే కష్టమే అని చెప్తున్నారు. ఈ సందర్భంలోనే జగన్ రోడ్ షో కు షరతులతో కూడినటువంటి అనుమతులు ఇస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. భారీ ఎత్తున సభలు సమావేశాలకు, ఎక్కువమందితో కూడిన రోడ్ షోలకు అనుమతి లేదని విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ శంకబ్రత స్పష్టం చేశారు. ఇక జగన్ వెంట కేవలం 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లుగా తెలిపారు. ఈ నిబంధనలను పాటించడంలో జగన్ అలాగే పార్టీ శ్రేణులు విఫలమైతే వెంటనే అనుమతులను రద్దు చేస్తాం అలాగే కేసులు కూడా నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. దీంతో నేడు ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠంగా మారింది.
Read also : నల్లగొండ వైద్యుల నిర్లక్ష్యం.! – గర్భిణి గర్భంలోనే పసికందు మృతి