ఆంధ్ర ప్రదేశ్

జగన్ పరిస్థితి… వర్క్ ఫ్రమ్ ఓదార్పు యాత్ర లా ఉంది: మంత్రి అనిత

క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్:- మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై హోంమంత్రి అనిత సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించాలి కానీ… జగన్ మాత్రం విచిత్రంగా యాత్రలు చేస్తున్నారని మంత్రి అనిత మండిపడ్డారు. జగన్ చేస్తున్న ఓదార్పు యాత్ర ఏంటో అర్థం కావడం లేదు కానీ… ఆయన చేస్తున్న ఓదార్పు యాత్ర మాత్రం వర్క్ ఫ్రం ఓదార్పు యాత్రల ఉందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎద్దేవా చేశారు. తాజాగా స్వర్ణాంధ్రవిజన్ -2047 ప్రణాళిక మరియు పి4 కార్యక్రమాలపై సమీక్షించేందుకు మంత్రి అనిత గురువారంనాడు విజయనగరం జిల్లాకు వచ్చి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ క్యాటగిరి సెక్యూరిటీ ఇస్తున్నామని తెలిపారు. ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ కూడా జగన్ కి ఇచ్చామని స్పష్టం చేశారు. అయినా కూడా చిన్నపిల్లాడిలా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వలేదని అబద్ధాలు చెప్పడం సరికాదు అని మంత్రి అనిత ఫైరయ్యారు. వైసిపి సోషల్ మీడియా కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అని అన్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూనే… ప్రజలకు ఉన్నటువంటి అవసరాలను తీర్చుతున్నారని అన్నారు.

వైసీపీ నిర్లక్ష్యం ఏంటో ఈ విషయం ద్వారానే తెలిసిపోతుంది: నిమ్మల రామానాయుడు

మార్కాపురం జిల్లా, వెలిగొండ ప్రాజెక్టుపై… స్పష్టత ఇవ్వని పవన్ కళ్యాణ్..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button