
వైసీపీ నేతలను కేసులు చుట్టుముడుతున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికితీస్తున్న కూటమి ప్రభుత్వం.. రెడ్‌బుక్‌లో పేర్లు రాసుకున్న వారందరిపై కేసులు పెడుతోంది. ఇప్పటికే వల్లభనేని వంశీ, నందిగాం సురేష్, గోరంట్ల మాధవ్, జోగి రమేష్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి… ఇలా చాలా మంది నేతలు కేసులను ఎదుర్కొంటున్నారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన అరెస్ట్ తప్పదని సమాచారం. ముఖ్యంగా లిక్కర్ స్కామ్… ఈ స్కామ్‌లో జగన్ చుట్టూ ఉన్న నేతలను అరెస్ట్ చేశారు. కసిరెడ్డి, గోవిందప్ప, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి.. జైల్లో ఉన్నారు. ఈ కేసులో తర్వాతి అరెస్ట్ ఎంపీ మిథున్‌రెడ్డిదే అంటున్నారు. ఆ తర్వాత.. ఏం జరుగుతుందో… లిక్కర్ లింక్స్.. ఏ బడా నేత వరకు వెళ్తాయో తెలీదు. దీంతో వైసీపీలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి ఉంది. త్వరలోనే జగన్ కూడా అరెస్ట్ కాక తప్పదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ జగన్ అరెస్ట్ అయితే.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు..? పార్టీని నడిపేది ఎవరు..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఏపీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తున్న సమయంలో… ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు అన్న ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేసినా… ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న వాదన ఉంది. అలాంటప్పుడు.. ముందుగానే జగన్ తర్వాత పార్టీని నడపగల సామర్థ్యం ఉన్న నాయకుడిని ముందే చూసిపెట్టుకోవడం మేలని అంటున్నారు. వైఎస్ జగన్‌కు.. విజయమ్మతోగానీ, షర్మిలతో గానీ మంచి సంబంధాలు లేవు. ఇక.. సజ్జల రామకృష్ణారెడ్డి… ఆయనపై ఇప్పటికే బోలెడు కేసులు. దానికి తోడు తీవ్ర వ్యతిరేకత ఉన్నాయి. వైవీ సుబ్బారెడ్డి.. ఆయనకు పార్టీ నడిపేంత సమర్థత లేదు. విజయసాయిరెడ్డి ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. వైసీపీ హయాంలో రాయలసీమలో రాజ్యమేలిన పెద్దిరెడ్డి రాజచంద్రారెడ్డి కుటుంబం కూడా కేసుల ఊబిలో చిక్కుకుని ఉంది. ఆ పరిస్థితిల్లో వైఎస్ జగన్ కూడా అరెస్ట్ అయితే… పార్టీ పరిస్థితి ఏంటి..? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో… జగన్ తర్వాత పార్టీని నడపగల సమర్థన ఉన్న నాయకుడు ఎవరు..? నెంబర్ స్థానం-2 స్థానం ఎవరికి ఇవ్వొచ్చు..? అన్న చర్చ మొదలైంది. ఈ సందర్భంగా.. అందరూ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వైపు చూస్తున్నారని సమాచారం. బొత్స… సీనియర్ రాజకీయ నాయకుడు. వివాద రహితుడు. గతంలో ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఒకప్పుడు ముఖ్యమంత్రి రేసులో కూడా ఉన్నారు బొత్స. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమకాలికుడు. ఆయన అనుభవం… సీనియారిటీ.. పార్టీకి మంచి చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా… బొత్స సత్యనారాయణపై కేసులు లేవు. రెడ్‌బుక్‌లో ఆయన పేరు కూడా లేదు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తారు… కానీ, అనుచిత వ్యాఖ్యలు చేయరు. ఇప్పుడే కాదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ, ఎవరిపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు బొత్స. అందుకే… ఆయన్ను కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోంది. పైగా వైసీపీ వాయిస్‌ను ప్రజల్లో తీసుకెళ్లగల సమర్థవంతమైన నాయకుడు కూడా. దీంతో… బొత్స అయితేనే.. పార్టీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలడని ఆలోచన వస్తోంది. మరి… ఏం జరుగుతోంది…? వైఎస్ జగన్ ఆలోచన ఎలా ఉందో…? చూడాలి.