
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కూటమి నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మొంథా తుఫాన్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో భారీగానే పంట నష్టం జరిగింది. అయితే దీనిపై తాజాగా జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ తరువాత తన సొంత ఛానల్ లో సీఎం గా లేకపోయినా కూడా తుఫాన్ ను ఆదుకున్న ఏకైక మగాడు జగన్ అంటూ కొన్ని వాక్యాలు కనిపించాయి. జగన్ గ్రాఫ్ ను అమాంతం ఆకాశానికి ఎత్తేయాలనుకున్న తొందరలో సొంత మీడియా చేస్తున్న వ్యాఖ్యలు జగన్ పరువు తీసేటువంటి విధంగా ఉన్నాయి.
Read also : ప్రతి నెలా.. ప్రతి నియోజకవర్గంలో.. జాబ్ మేళాలు నిర్వహించాలి : సీఎం చంద్రబాబు
నిన్న మధ్యాహ్నం నుంచి తన సొంత ఛానల్ నుంచి వస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యలపై కూటమి నేతలు కౌంటర్లు వేస్తున్నారు. మేము ఎవరరూ కూడా జగన్ మగాడు కాదనలేదు కదా అంటూ వ్యంగ్యంగా ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు కూడా ప్రకృతి వైపరీత్యాలు సమయంలో గడప దాటిన దాఖలు లేవు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ నివాసానికి జగన్మోహన్ రెడ్డి పరిమితమయ్యారు. పంట నష్టపోయిన రైతులు వద్దకు ఎప్పుడు కూడా వెళ్లలేదు. ప్రస్తుతం మొంథా తుఫాను నేపథ్యంలో భారీగా పంట నష్టం జరిగిన కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పటిలాగానే బెంగళూరు వెళ్ళిపోయారు. అలాంటి వ్యక్తి ఈ తుఫాన్ నష్టాల గురించి మాట్లాడడం నవ్వులు పూయిస్తుంది అని కామెంట్లు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో తుఫాన్ బీభత్సం సృష్టించిన కూడా జగన్ స్టేజ్ వేయించి మరి పరిశీలన కార్యక్రమాలు చేపట్టారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఎక్కడో ఉండి తుఫాను ను ఆపిన మొనగాళ్లు అంటూ వ్యాఖ్యలు చేయడం సరి కాదు అని హితవు పలుకుతున్నారు.
Read also : ఆదివారం ఫైనల్ మ్యాచ్… గెలిస్తే మరోచరిత్ర సృష్టించినట్టే?
 
				 
					
 
						 
						




