
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం ఢిల్లీలో మోడీతో భేటీ అయిన సీఎం చంద్రబాబు అనంతరం పార్టీ ఎంపీలతో భేటీ అయిన సందర్భంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకానందారెడ్డి హత్య తరహాలో మళ్లీ నేరాలు, ఘోరాలు చేస్తూ ఏపీలో అలజడి సృష్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ తరుణంలో ప్రతి ఒక్కరు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని, వైసీపీ నాయకులు అలాగే కార్యకర్తలు చేస్తున్నటువంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తూ ముందుకు వెళ్లాలని ఎంపీలకు చంద్రబాబు వివరించినట్లు తెలుస్తుంది. మన రాష్ట్రంలో మూర్ఖుడు లేదా ఇంకా అంతకుమించి పదాలుంటే అవి కరెక్ట్ గా జగన్కు అలాగే ఆయన అనుచరులకు వర్తిస్తాయని చెప్పారు. జగన్ నేర కార్యకలాపాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయని… ఆయన పార్టీ మొత్తం కూడా నేరాలకు అడ్డాగా మారిందని విమర్శించారు. వైసిపి నేతలు నేరాలు చేసి తిరిగి వాటిని తెలుగుదేశం పార్టీ మీదకి నెట్టడం చాలా కామన్ గా మారిపోయింది అంటూ ఆరోపించారు. ఈ కల్తీ మద్యం దర్యాప్తులో చాలా లోతుగా వెళుతున్న కొద్ది కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయని… ప్రతి ఒక్కరిని బయటకు తీసుకువస్తామని అన్నారు. వాళ్ళు చేసిన నేరాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పై నెట్టేలా కుట్రలు పన్నుతున్నారని.. కాబట్టి ఎప్పటికప్పుడు వీటిపై కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. వారు చేసినటువంటి కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాలని చంద్రబాబు నాయుడు సూచించినట్లు సమాచారం.
Read also : పల్లె పిల్ల కాదు… పులి పిల్ల..! అదరగొట్టిన భవ్య తేజిని బాక్సింగ్ ప్రతిభ
Read also : ఒకవైపు పెరుగుతున్న బంగారం ధరలు.. మరోవైపు అసలు తగ్గమంటున్న జేబు దొంగలు.. జరభద్రం!