
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- వైయస్ జగన్ సోదరి, ప్రస్తుత ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైయస్ షర్మిల తన అన్న జగన్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఎప్పుడూ కూడా మా అన్నను దూరం పెట్టలేదని.. జగనే కావాలని మమ్మల్ని దూరం పెట్టారు అని షర్మిల అన్నారు. అసలు మీకు ఎవరు చెప్పారు జగన్ కు నేను దూరంగా ఉన్నాను అని?.. మీడియా మిత్రులను ప్రశ్నించారు. నేను రాజకీయపరంగానే కాదు.. కుటుంబం పరంగా కూడా చాలా అండగా ఉన్నాను అని… లేదంటే జగన్ వెంట 3 వేల కిలోమీటర్ల దూరం అలా అలవోకగా పాదయాత్ర ఎందుకు చేస్తాను అని అన్నారు. జగన్ గెలుపు వెనుక ముఖ్యపాత్ర పోషించిన నన్ను.. జగన్ వదిలేయడం వల్లనే నా దారి నేను చూసుకున్నాను అని షర్మిల చెప్పుకొచ్చారు. గతంలో బీఆర్ఎస్ పార్టీతో కలిసి నన్ను అరెస్టు చేయించారు.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఎన్నో విధాలుగా నన్ను జగన్ ఇబ్బంది పెట్టారు అని ఆనాటి సంగతులను మరోసారి గుర్తు చేసుకున్నారు. ఒక చెల్లిగా నేను ఎప్పుడూ కూడా జగన్ కు అండగా ఉన్నాను అని… విశ్వాసం అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు అని.. అది మనసులో ఉండాలి అని అన్నారు. కానీ జగన్ కు అలాంటివి ఏమీ లేవు.. అందుకే నా దారి నేను చూసుకున్నాను అంటూ షర్మిల చెప్పుకొచ్చారు. గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా నేను తప్ప మిగతా ఎవరూ కూడా బయటకు రాలేదు జగన్ కు అండగా నిలబడలేదు అను.. అది రాష్ట్రం మొత్తం చూసింది అని వివరించారు. ఇక ఆస్తులు విషయంలోనూ వివాదాలు నేను సృష్టించలేదు.. కానీ నేను సృష్టించినట్టుగా మీడియాలో ప్రచారం చేశారు అని మండిపడ్డారు.
Read also : క్షణికావేశంలో ఏ చిన్న తప్పు చేసిన జీవితాంతం కుమిలిపోతారు : సజ్జనార్
Read also : ఆటో కిరాయి విషయంలో ఘర్షణ.. ఎయిర్ గన్ తో కాల్పులు!





