ఆంధ్ర ప్రదేశ్

జగన్‌కు సొంత పార్టీ నుంచే వెన్నుపోట్లు - టీడీపీతో కలిసి వైసీపీ ఓటమికి ప్లాన్లు

వైఎస్‌ జగన్‌కు సొంత పార్టీ నేతల నుంచే వెన్నుపోట్లు మొదలయ్యాయా…? నమ్మి పక్కన పెట్టుకుంటే.. వెనుక చేరి గోతులు తీస్తున్నారా…? వైసీపీ ఓటమికి సొంత పార్టీలోని కీలక నేతలే ప్రయత్నిస్తున్నారా…? త్రిపురాంతకం ఎంపీపీపై అవిశ్వాసం వెనుక మాజీ మంత్రి హస్తం ఉందా…? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ త్రిపురాంతకం ఎంపీపీపై అవిశ్వాసం వెనుకున్న కుట్ర ఏంటి…? వెన్నుపోటు పొడిచిన ఆ మాజీ మంత్రి ఎవరు…?

ఆదిమూలపు సురేష్‌… గత వైసీపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి. జగన్‌ కేబినెట్‌లో ఐదేళ్లు పూర్తిగా మంత్రి పదవి అనుభవించిన నాయకుడు. ఆదిమూలపు సురేష్‌ను బాగా నమ్మారు వైఎస్‌ జగన్‌. వైసీపీ హయాంలో మూడేళ్ల తర్వాత కేబినెట్‌ విస్తరణ జరిగింది. ఆ సమయంలో చాలా మందిని మంత్రి పదవుల నుంచి తప్పించి కొత్త వారికి ఛాన్స్‌ ఇచ్చారు జగన్‌. సమీప బంధువు అయిన బాలినేని శ్రీనివాస్‌రెడ్డిని కూడా పక్కనపెట్టారు. కానీ… ఆదిమూలపు సురేష్‌ను మాత్రం కేబినెట్‌లో కొనసాగించారు. అంత నమ్మకం పెట్టుకుంటే… ఆయన ఏం చేశారు..? గత ఎన్నికల్లో తన నియోజకవర్గం మార్చారని అసంతృప్తి వెళ్లగక్కారు. పార్టీకే వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశారని సమాచారం.


Also Read : బీజేపీలోకి విజయసాయిరెడ్డి ఎంట్రీ – జాయినింగ్‌ ఎప్పుడంటే..!


2024 ఎన్నికల్లో నేతల నియోజకవర్గాలను మార్చారు వైఎస్‌ జగన్‌. సురేష్‌ను కూడా సొంత నియోజకవర్గం ఎర్రగొండపాలెం నుంచి కొండెపికి పంపారు. కొండెపి నుంచి సురేష్‌ ఓడిపోయారు. ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌ గెలిచారు. తన నియోజకవర్గం మార్చడం వల్లే… ఓడిపోవాల్సి వచ్చిందని సురేష్‌ భావిస్తున్నారట. ఆ అసంతృప్తితోనే… త్రిపురాంతకం ఎంపీపీపై అవిశ్వాసం విషయంలో టీడీపీకి సహకరించారని ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి.


Also Read : టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు – టెన్షన్‌లో చంద్రబాబు..!


ఇటీవల ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని త్రిపురాంతకం ఎంపీపీపై టీడీపీ నేతలు అవిశ్వాసం పెట్టారు. ఆ సమయంలో… అక్కడ ఎక్కువ మంది ఎంపీటీసీలు వైసీపీ నుంచి టీడీపీలోకి జంపయ్యారు. దీంతో… ఇరుపార్టీల బలాబలాలు సమానం అయ్యాయి. అయితే… టీడీపీకి వెళ్లిన ఎంపీటీసీల్లో ఒకరు వైసీపీ అనుకూలంగా ఓటువేయడంతో… ఎంపీపీ పదవిని వైసీపీ నిలబెట్టుకుంది. అయితే… వైసీపీ నుంచి టీడీపీలో జంప్‌ అయిన ఎంపీటీసీలు మాజీ మంత్రి సురేష్ వర్గానికి చెందినవారని.. ఆయన అనుమతితోనే తెలుగుదేశంలో పార్టీలో చేరారని సమాచారం. దీంతో.. ఆయనపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు.. ఎర్రగొండపాలెం వైసీపీ నేతలు. అధిష్టానం కూడా ఆదిమూలపు సురేష్‌ తీరుపై సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రాజకీయం ఆదిమూలపు సురేష్‌ వర్సెస్‌ తాటిపర్తి చంద్రశేఖర్‌ అన్నట్టు సాగుతోంది. దీనిపై వైసీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి .. 

  1. తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్‌ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.

  2. మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని? 

  3. కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!

  4. కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?

  5. ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button