
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- వైసీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ దీపావళికి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఇంటింటా దీపాలు వెలిగిస్తామన్న వ్యాఖ్యలపై.. వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది… మరి ఒక దీపమైన వెలిగిందా అని సెటైర్లు వేశారు. ఎన్నికలలో భాగంగా ప్రజలకు ఇచ్చినటువంటి….
1. 3000 నిరుద్యోగ భృతి
2. మహిళలకు నెలకి 1500
3. రైతులకు ఏడాదికి 20000
4. పిల్లలకు ప్రతి యేట 15000
5. ఇంటింటికి 3 ఉచిత సిలిండర్లు
6. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు..
పైన తెలిపిన హామీలన్నీ కూడా చంద్రబాబు నెరవేర్చారా?.. అని ప్రశ్నించారు. ఇవన్నీ వెలగని దీపాలే కదా?.. సీఎం గారు.. అని వైయస్ జగన్ ట్విట్ చేశారు. గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అందించిన 30 పథకాలు అనే దీపాలను ఆర్పేసి చీకటికి ప్రతినిధులు అయ్యారంటూ తీవ్రంగా విమర్శించారు.
Read also :నిజామాబాద్‌లో రియాజ్ ఎన్‌కౌంటర్.. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసుకు ముగింపు
Read also : బ్రేకింగ్ న్యూస్… ఎన్కౌంటర్ లో చనిపోయిన రియాజ్