ఎన్డీఏ కూటమిలో భాగంగా భారీ మెజార్టీతో గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం గా చంద్రబాబు ఎన్నికైన విషయం అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు గెలిచిన తర్వాత ఇసుకపై అలాగే మద్యం పై కొత్త పాలసీలు తీసుకొచ్చారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాలపై లాటరీ పద్ధతులు నిర్వహించారు. ఇందుకుగా నువ్వు ఏకంగా రాష్ట్రంలో 3, 396 షాపులకు సంబంధించి లైసెన్సులను కూడా విడుదల చేసి ఆయా జిల్లాలోని ఆయా మండలాలకి కొన్ని మద్యం షాప్ దరఖాస్తులకైతే నిర్వహించారు. అయితే కొత్తగా ప్రారంభించేటటువంటి మద్యం షాపులు అనేవి 16వ తారీకు నుండి ప్రారంభం అవుతాయని మంత్రి కొల్లు రవీంద్ర కూడా అన్నారు.
అయితే ఈ విషయాలపై రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించాడు. కొత్త మద్యం పాలసీలు తీసుకువచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని చంద్రబాబు మీద ఫైర్ అయ్యాడు. అలాగే కొత్త మద్యం పాలసీ తేవడం ద్వారా ఇప్పటివరకు ఉన్నటువంటి దాదాపుగా 15 వేల మంది ఉద్యోగాలు గల్లంతయినట్లేనని చెప్పుకొచ్చాడు. చంద్రబాబు కార్యకర్తలు డబ్బులు సంపాదించుకోవడానికి ఈ కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చినట్లు జగన్ ట్విట్టర్ ద్వారా ఫైర్ అయ్యాడు. ఈ కొత్త మద్యం పాలసీ ద్వారా రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు ప్రమాదం అని చెప్పుకొచ్చాడు.