
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ఐపీఎల్ 2026 మినీ వేలం నిన్న అబుదాబిలో జరగగా అందులో ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ కెమెరూన్ గ్రీన్ 25 కోట్ల భారీ ధరకు కోల్కత్తా జట్టు దక్కించుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. అయితే 25 కోట్లకు మంచి ప్లేయర్ ను దక్కించుకున్నామన్న ఆనందంలో కోల్కత్తా జట్టు అభిమానులు ఉండగా కొద్దిసేపటికే ఆనందం కాస్త ఆందోళనగా మారింది. దానికి కారణం ఏంటంటే నిన్న ఐపీఎల్ వేలం జరుగుతున్న సమయంలోనే మరోవైపు యాషస్ మూడో టెస్ట్ జరుగుతుంది. ఐపీఎల్ వేలంలో గ్రీన్ జాక్పాట్ కొట్టిన కొద్ది క్షణాలకే యాషష్ టెస్టులో గ్రీన్ డక్ ఔట్ అయ్యారు. కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని ఆర్చర్ బౌలింగ్ లో సున్న పురుగులకే అవుట్ అవ్వడంతో.. ఇతనికి వేలంలో 25 కోట్లు పెట్టడం అవసరమా అంటూ నెటిజనులు ఆగ్రహంతో కామెంట్లు చేస్తూ ఉన్నారు. నిన్న జరిగిన ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడుగా గ్రీన్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ నిబంధనల ప్రకారం గ్రీన్ 18 కోట్లు మాత్రమే అందుకోగలరు. మిగిలిన మొత్తం కోట్లు బిసిసిఐ వెల్ఫేర్ ఫండ్ కు వెళ్ళనున్నాయి.
Read also : GOOD NEWS: రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ కానుక
Read also : Gold Prices: బంగారం కొనడానికి ఇంతకన్నా మంచి ఛాన్స్ ఉండదు.. వెళ్లండి.. వెళ్లి వెంటనే కొనేసేయండి!





