
క్రైమ్ మిర్రర్, లైఫ్ స్టైల్ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆరోగ్యం కోసం ఉదయం పూట వాకింగ్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం నడవడం అనేది శరీరానికి ఎంత మంచిదైనప్పటికీ.. చలికాలంలో మాత్రం ఉదయాన్నే వాకింగ్ చేసే వారికి లాభాలు కంటే నష్టాలు ఎక్కువ ఉంటాయి అని తాజాగా వైద్య నిపుణులు సూచించారు. ఈ చలికాలంలో తెల్లవారుజామున వాకింగ్ చేసేవారు.. ఆ చల్లటి గాలి అనేది మనుషుల ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది అని తెలిపారు. చల్లటి గాలి అనేది ఊపిరితిత్తులపై ఒత్తిడి తీసుకువస్తుంది అని.. బీపీ కూడా అమాంతంగా పెరిగిపోతుంది అని స్పష్టం చేశారు. ఇలాంటి సందర్భంలోనే గుండెపై అధిక ఒత్తిడి పెరుగుతుంది అని.. కాబట్టి ఈ చలికాలం పూర్తయ్యేంతవరకు కూడా ఉదయాన్నే వాకింగ్ చేయకపోవడం బెటర్ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 8 గంటల తర్వాత ఒక గంట వ్యాయామం చేస్తే సరిపోతుంది అని తెలిపారు. తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచి 7 లేదా 8 గంటల వరకు వ్యాయామం చేయడం అనేది ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి అలవాటుగా మారిపోయింది. కాబట్టి ఈ చలికాలం పూర్తయ్యేంతవరకు కూడా ఎవరు ఎనిమిదింటి వరకు చల్లటి గాలుల సమయంలో నడవడం లాంటివి చేయకండి అని తెలిపారు. అసలు వ్యాయామం అలవాటు లేని వారు ఈ చలికాలంలో ఆరోగ్యం కోసం వాకింగ్ చేశారు అంటే.. సడన్ గా చలిలోకి వెళ్లడంతో ఇమ్యూనిటీ ప్రభావం పడుతుంది అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీంతో జలుబు చేసి అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఇక వృద్ధులైతే ఈ చలికాలంలో అసలు ఉదయం పూట వాకింగ్ చేయవద్దని… ఒక్కోసారి ముంచులో కూడా రోడ్డు సరిగా కనిపించక ప్రమాదాలకు గురైనటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి హెచ్చరిస్తున్నారు.
Read also : Promises: వారెవ్వా.. మహిళా సర్పంచ్ అభ్యర్థి బంపర్ ఆఫర్
Read also : కెప్టెన్సీ ఇస్తే వద్దంటానా.. యంగ్ ప్లేయర్ ఆశాభావం!





