ఆంధ్ర ప్రదేశ్

ఓడిపోయి ఏడాది అవుతుంది… మరి జనాల్లో వైసీపీకి ఆదరణ దక్కిందా? లేదా?

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీ ఘోర పరాజయాన్ని పొందింది. గత ఏడాదిలో జరిగిన ఎలక్షన్లలో వైసిపి పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఓటు శాతం మాత్రం 40 కి పైగానే ఉంది. అధికారికంగా వైసిపి ఓడిపోయిన కూడా జనాదరణ మాత్రం చాలానే ఉంది. ఇప్పటికీ కూడా పార్టీ వెనుక ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారని ఊహగానాలు అయితే వినిపిస్తూనే ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ప్రస్తుతం జగన్ ఎక్కడికి వెళ్ళినా కూడా భారీగా తండోపతండాలుగా జనాలు హాజరవుతున్నారు. ప్రస్తుతం వైసీపీ పార్టీ ఓడిపోయి ఏడాది పూర్తి చేసుకుంది. మరి 2029 లో జరిగే ఎలక్షన్లకు వైసీపీ పార్టీకి ఓటు బ్యాంకు అసలు ఎలా ఉంది?.. తగ్గిందా?.. లేక పెరిగిందా? అనే అంచనాలు మాత్రం భారీగానే వినిపిస్తున్నాయి.

ఏ ప్రస్తుత పరిస్థితులను వైసీపీకి మాత్రం ఓటు బ్యాంక్ అనేది తారుమారు అవుతూ వస్తూ ఉంది. కొందరు చేసిన సర్వేల ద్వారా వైసీపీకి చాలా తక్కువ ఆదరణ కలుగుతుంది. దీంతో వైసిపి ఓటు బ్యాంక్ అనేది స్థిరంగా లేదనే వాదన వినిపిస్తుంది. గత ఎలక్షన్ల సమయంలో 40 శాతం ఓటు బ్యాంకుతో ప్రజల్లో వైసిపి పార్టీకి ఇంకా ఆదరణ ఉందని తెలిపిన కూడా… కేవలం నాలుగు లేదా ఐదు శాతం ఓటు బ్యాంకు తేడాతోనే అధికారాన్ని వైసీపీ కోల్పోయింది. కానీ ఓడిపోయిన తర్వాత వైసీపీకి ఓటు బ్యాంకు పెరిగిందా అంటే సందేహమే అని చెప్పాలి. ఎందుకంటే ప్రజా సమస్యలపై బలంగా పోరాడటం అనేది పార్టీకి చాలా ముఖ్యం. కానీ వైసీపీ అలాగే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం అలా చేయట్లేదు. మరి ముఖ్యంగా అసెంబ్లీకి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి చాలామంది నుంచి వ్యతిరేకత ఏర్పడింది.

అంతేకాకుండా పార్టీ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యేలను అలాగే మంత్రులను పార్టీలోనే ఉంచుకోలేకపోవడం మరొక పెద్ద మైనస్ అని చెప్పాలి. పార్టీలో నాయకులు విడిపోవడం.. అందరూ జగన్ వైపే తప్పులు చూపించడం ఇవి జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రతి సమస్యను కూడా ప్రజల మధ్య కాకుండా కేవలం సోషల్ మీడియాను మాత్రమే నమ్ముకొని ముందుకు రావడం అనేది అతిపెద్ద తప్పు. వైసీపీకి ప్రజలు మాత్రం భారీగా కార్యక్రమాలకు హాజరవుతున్న .. లో లోపల ఏం జరుగుతుందో కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఇది ఇలానే కొనసాగితే… భవిష్యత్తులో మళ్లీ ఓడిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

కొత్త టెక్నాలజీలు ఆరోగ్యానికి హానికరమా !… ఎక్కువసేపు ఫోన్ చూస్తున్నారా?. అయితే ఇది మీకోసమే

బోయింగ్ విమాలు సేఫేనా? అనుమానాలకు సమాధానాలేవి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button