
మాదాపూర్, క్రైమ్ మిర్రర్ :- నిత్యం పనిచేసే ఐటీ ఉద్యోగులు ఆటపాటలతో ఆకట్టుకున్నారు. చూడముచ్చ టైన శాస్త్రీయ నృత్యాలే కాకుండా, సినిమా పాటలకు స్టెప్లు వేసి ఆదుర్స్ అనిపించారు. హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ సంస్థ ఆదివారం ‘ఏడీపీ ఇండియా’ పేరిట కంపెనీ డే వేడుకలను మాదాపూర్ హెచ్ఐసీ సీలో నిర్వహించింది.
ఈ సందర్భంగా ఉద్యోగులు తమ కళాప్రతిభను ప్రదర్శించారు. అనంతరం ఉత్తమ సేవలందించిన ఉద్యోగు లకు యాజమాన్యం అవార్డులు అందజేసి సత్కరించారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ వేములపల్లి మాట్లాడుతూ.. ఉద్యోగుల సేవలను గుర్తించి సత్కరించడంతో పాటు వారిలో నూతనోత్సాహం నింపేందుకు వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు.
Read also : ఏపీ లిక్కర్ కేసు ముగిసినట్టేనా..!
Read also : టీటీడీ ఈవో శ్యామలరావు బదిలీ వెనుక కారణం అదేనా..!