
క్రైమ్ మిర్రర్, తెలంగాణ న్యూస్ :- బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన జైలు కు వెళ్లిన సందర్భం గురించి కీలకమైన విషయాలను బయటకు వెల్లడించారు. తాజాగా టీవీ5 తెలుగు ఛానల్ కు ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకు కల్వకుంట్ల కవిత సంచలన విషయాలను చెప్పుకొచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నన్ను అరెస్టు చేసి తీహారు జైలుకు తీసుకుపోతున్న సందర్భంలో నాకు చాలా బాధ కలిగిందని అన్నారు. ఆ బాధ కంటే… ఆ సందర్భంలో నాకు మా పార్టీ అండగా నిలబడలేదని చాలా ఎక్కువ బాధపడ్డాను అని చెప్పుకొచ్చారు. జైలుకు వెళుతున్న సందర్భంలో నా తండ్రి కెసిఆర్ కు ఒక విషయాన్ని తెలిపాను. నా అరెస్టును ఖండిస్తూ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమని నా తండ్రి కెసిఆర్ ని కోరిన కూడా.. ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదని, ఆ సమయంలో నాకు పార్టీ అండగా నిలబడలేదని అర్థమైందని అన్నారు. అరెస్టు చేసిన సందర్భంలో మా పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తుందని అనుకున్నాను. కానీ అసలు ఏమీ జరగనట్లు నాయకులు అందరూ కూడా ఎవరి పనులు వారు చేసుకున్నారు అని అన్నారు.
అయితే ఇదివరకు రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు కానీ అలాగే చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన సందర్భంలో కానీ మీరు పార్టీలకు కుటుంబం మరియు పార్టీ నేతలు అలాగే చాలామంది కార్యకర్తలు తరలివచ్చి మరి ఆయా నాయకుల కోసం పోరాడారు. జైలుకు వెళ్లిన సందర్భంలో ఎంతోమంది పార్టీ నాయకులు వారికి అండగా నిలిచారు. ప్రతి ఒక్క కార్యకర్త అలాగే నాయకులు కలిసి కలిసికట్టుగా ఉండి ఎలా బయటకు తీసుకువచ్చారో నిరూపించిన సందర్భాలు చాలానే ఉన్నాయని అన్నారు. కానీ నేను జైల్లో ఉన్నప్పుడు మాత్రం ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదని కలవకుంట్ల కవిత తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నన్ను జైలు నుంచి విడిపించడానికి నా తండ్రి కెసిఆర్ చాలానే ప్రయత్నం చేసి అన్ని ఖర్చులు కూడా భరించారు అని అన్నారు. కానీ పార్టీ పరంగా మాత్రం నాకు ఎటువంటి మద్దతు లభించేలా చేయలేకపోయారని అన్నారు.
జైలు సమయంలో… అండగా నిలిచారని జగన్ కి కృతజ్ఞతలు తెలిపిన వంశీ!
జులై నెల మొత్తం వర్షాలే!.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ