తెలంగాణ

55 టీంలు.. 50 గంటలు.. ఐటీ సోదాలతో దిల్ రాజుకు చుక్కలు!

టాలీవుడ్ నిర్మాతలపై ఐటీ శాఖ పంజా విసిరింది. ఏకంగా మూడు రోజుల పాటు సోదాలు జరిపింది. తెలంగాణ ఫిల్మ్ డెవల్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ దిల్ రాజుతో పాటు సంక్రాంతికి విడుదలైన మూడు పెద్ద సినిమా నిర్మాతల ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. సినీ నిర్మాతలకు ఫైనాన్స్ చేసే సంస్థలపైనా దాడులు చేశారు.

సినీ ప్రముఖుల ఇళ్లలో జరిగిన ఐటీ సోదాలు అర్థరాత్రి ముగిశాయి. మూడు రోజుల పాటు 16 చోట్ల తనిఖీలు చేశారు అధికారులు. 55 టీంలతో సినీ నిర్మాతలు, డైరెక్టర్లపై ఐటీ సోదాలు జరిగాయి. సినీ దర్శకుడు సుకుమార్‌, నిర్మాత దిల్‌రాజు, మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్వాహకులు యర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, దర్శకుడు సుకుమార్, మ్యాంగో మీడియా సంస్థకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ బృందాలు తనిఖీలు చేశాయి.

దిల్ రాజు నివాసంలో దాదాపు 50 గంటల పాటు ఐటీ సోదాలు జరిగాయి. బంజారాహిల్స్‌ సాగర్‌ సొసైటీలోని దిల్‌రాజు కార్యాలయంతోపాటు జూబ్లీహిల్స్‌ ఉజాస్‌ విల్లాస్‌లోని నివాసం, ఆయన కుమార్తె హన్సితారెడ్డి, సోదరులు నర్సింహారెడ్డి, శిరీష్‌ ఇళ్లు, కొండాపూర్‌లోని సుకుమార్‌ ఇంట్లో సోదాలు చేపట్టారు. ఫైనాన్స్ సంస్థ సత్య రంగయ్య ఇంట్లో సైతం సోదాలు చేపట్టారు. నెల్లూరు ప్రతాపరెడ్డి ఇంట్లో 2 రోజుల పాటు ఐటీ సోదాలు జరిగాయి. నెల్లూరు ప్రతాప్‌రెడ్డి ఎన్నారై నిధులు సినిమాలకు సమకూర్చినట్లు గుర్తించారు. ప్రతాప్‌రెడ్డి భారీగా నిధులు గోల్‌మాల్‌ చేసినట్టు ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఐటీ అధికారుల తీరుపై దిల్ రాజు ఆసహనం వ్యక్తం చేశారు. ఇంకెన్ని రోజులు సోదాలు చేస్తారని ప్రశ్నించారు. సోదాల తొలిరోజు.. ఇదంతా కామన్ అని కామెంట్ చేసిన దిల్ రాజు.. మూడు రోజులు సోదాలు చేయడంతో షాకయ్యారని తెలుస్తోంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button