
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష వైసీపీ పార్టీ నాయకులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఈ ప్రతిపక్ష నాయకులతో రాజకీయం చేయాలి అంటే సిగ్గేస్తుంది అని తీవ్రంగా మండిపడ్డారు. సాక్షాత్తు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం అయినటువంటి పరకామణిలో చోరీ జరిగితే దాన్ని చాలా చిన్న నేరంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావించడాన్ని ఏమనాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఎంతోమంది భక్తులు పవిత్రంగా భావించేటువంటి లడ్డు ప్రసాదంలో కూడా కల్తీ నెయ్యి సరిపడా జరిగితే దాన్ని కూడా వెనకేసుకు వస్తారా?.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న ఇటువంటి నాయకులతో రాజకీయం చేయడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రాజకీయాల ముసుగులో ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్నారు అని.. సింగయ్య అనే వ్యక్తి ని కారు కింద తొక్కించి ఆయన భార్యతో మాపై ఆరోపణలు చేయించారు అని తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి వారితో రాజకీయాలు చేయడం కూడా వేస్ట్ అని ఇన్డైరెక్టుగా తెలిపారు.
Read also : HI ALERT: ఎవ్వరూ బయటకు రావొద్దు!
Read also : HI ALERT: ఎవ్వరూ బయటకు రావొద్దు!





