
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పై వైసీపీ తీవ్రంగా మండిపడింది. ఎన్నికలకు ముందు ఒకలాగా.. ఎన్నికలు అయిన తర్వాత మరోలా సీఎం ప్రవర్తిస్తున్నారు అంటూ వైసీపీ తీవ్రంగా విమర్శించింది. మరీ ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు రైతన్నలకు వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం డబ్బులను ప్రజల ఖాతాల్లో జమ చేసిన విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు చొప్పున 46 లక్షల 85838 మంది రైతుల ఖాతాల్లో 3135 కోట్లను డిపాజిట్ చేశారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం కోయంబత్తూరులో పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. ఈ క్రమంలోనే గత మా వైసీపీ ప్రభుత్వంలో 53.58 లక్షల మందికి ఈ పథకం కింద డబ్బులు అందజేశామని.. మీరు ఏకంగా ఏడు లక్షల మందికి పైగా లబ్ధిదారులను తొలగించి 46 లక్షలకు మాత్రమే డబ్బులు పంచడం అనేది దారుణమని విమర్శించింది. అలాగే ప్రతి ఒక్క పంటకు కూడా మద్దతు ధరలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంటే.. కనీసం రైతులను పట్టించుకునే దిక్కులేదు అని వైసిపి పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వంలో అసలు ప్రజల ధ్యాసే చంద్రబాబు నాయుడుకి లేదు అని.. రైతన్నలకు వెన్నుపోటు పొడిచాడు అని వైసిపి మండిపడింది.
Read also : Anmol Bishnoi: భారత్ కు అన్మోల్ బిష్ణోయ్, ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతి!
Read also : యాంకరింగ్ లో ఆమెకు మించి తోపులేరు.. ఖచ్చితంగా ‘పద్మశ్రీ’ ఇవ్వాలి : ఆది





