హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: ఇరాన్‌పై శనివారం ఇజ్రాయెల్ మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో టెహ్రాన్ అంతటా పేలుళ్లు సంభవించాయి. దీంతో పట్టణమంతా పొగతో నిండిపోయింది. కాగా అణు ఒప్పందంపై అమెరికా-ఇరాన్ తో చర్చలు జరుగుతున్న వేళ్ల ఈ దాడులు జరుగడం ప్రాధాన్యత సంచరించుకున్నాయి.
ఈ దాడులు అమెరికాతో కలిసి దాడులు చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా శత్రు దేశం ఇరాన్ నుంచి ముప్పు ఉన్న నేపథ్యలో ముందుగానే ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ రక్షణ మంత్రి కట్జ్ తెలిపారు. ఇరాన్ నుంచి వైమానిక దాడులు జరగే అవకాశం ఉన్నందున టెల్అవీవ్ ప్రజలను అప్రమత్తం చేసింది.
సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని సూచించింది. పాఠశాలలకు సైతం సెలవులు ప్రకటించడమే కాకుండా ఎమర్జెన్సీ ప్రకటించింది. దీంతో ఇజ్రాయిల్ తన గగనతలాన్ని మూసివేసింది. సైన్యం అప్రమత్తమైంది. కాగా అమెరికా కూడ ఈ దాడుల్లో పాల్గొన్నట్లు కొన్ని కథనాలు రావడం కొసమెరుపు.
