అంతర్జాతీయం

ఇజ్రాయెల్ భీకర దాడులు, 38 మంది గాజా వాసుల మృతి!

Israel Airstrikes in Gaza: గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. ఈ వైమానిక దాడుల్లో కనీసం 38 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 130 ప్రాంతాలను టార్గెట్ చేసి దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది.  హమాస్‌ కమాండ్‌, కంట్రోల్‌ నిర్మాణాలు, స్టోరేజి సౌకర్యాలు, ఆయుధగారాలు లక్ష్యంగా తమ దాడులు కొనసాగినట్టు తెలిపింది.  ఓవైపు కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో చర్చించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బయల్దేరని నేపథ్యంలో ఈ దాడులు కొనసాగడం విశేషం. ఇజ్రాయెల్ వరుస దాడులతో హమాస్ తో కాల్పుల విరమణ ఒప్పందంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తోంది. ట్రంప్ తో చర్చల తర్వాత హమాస్ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నారు. మరికొద్ది గంటల్లోనే ముఖ్యమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఇజ్రాయెల్‌ వైదొలిగితేనే ఆయుధాల వదిలేస్తాం!

అటు సౌత్ లెబనాన్‌ నుంచి ఇజ్రాయెల్‌ తప్పుకోవడంతో పాటు వైమానిక దాడులను ఆపేంత వరకు తాము ఆయుధాలు వదిలిపెట్టేదే లేదని హెజ్‌బొల్లా నేత నయీం కసెం తేల్చి చెప్పారు. మొహర్రం సందర్భంగా  బీరుట్‌ దక్షిణ శివార్లలో జరిగిన కార్యక్రమంలో వేల మందిని ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇజ్రాయెల్ దళాలు తమ మీద దురాక్రమణకు దండెత్తి వస్తుంటే, తమ భూభాగాల్లోకి చొరబడి ప్రాణాలు తీస్తుంటే, ఏం చేయకుండా మౌనంగా ఎలా ఉండాలని ప్రశ్నించారు. లెబనాన్‌ లో ఆక్రమణకు చట్టబద్ధత కల్పించడానికి తాము సాహకరించబోమని తేల్చి చెప్పారు. ఆయుధాలు లేకపోతే, ఇజ్రాయెల్ ను ఎలా నివలువరిస్తాం? అని ప్రశ్నించారు.

Read Also: ఇజ్రాయెల్ తో యుద్ధం.. తొలిసారి ప్రజల ముందుకు ఖమేనీ!

Back to top button