నల్లగొండ ప్రతినిధి తుప్పరి రఘు(క్రైమ్ మిర్రర్): మండలంలోని సంగారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, మూడు ఓట్ల మెజారిటీతో ఈసం రమేష్ విజయం సాదించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ప్రత్యర్థి, మాతంగి శ్రీనయ్యపై, రమేష్ గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి అయినప్పటికీ, అధికార పార్టీ అభ్యర్థితో తలబడి గెలవడం, ప్రజలలో రమేష్ పై ఉన్న నమ్మకమనే చెప్పాలి.
విజయం సాధించిన సర్పంచ్ రమేష్ కు, బందు మిత్రులు, అభిమానులు, ప్రజలు, యువత అభినందనలు తెలిపారు. తనపై నమ్మకంతో సర్పంచ్ గా గెలిపించిన, గ్రామ ప్రజలకు ఎల్లవేలలా అందుబాటులో ఉంటానని, ప్రభుత్వం నుండి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో, భాగస్వామ్యం అవుతానని, తన గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు..





