లైఫ్ స్టైల్

మెదడు షార్ప్ గా లేదా?.. అయితే వెంటనే ఇలా చేయండి లేదంటే మీకే నష్టం!

క్రైమ్ మిర్రర్, న్యూస్ :- మనిషి శరీరంలో మెదడు ఎంత పాత్రను పోషిస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. మన మానవుల మెదడు బరువు సుమారుగా 1.4 కిలోలు ఉంటుంది. కానీ శరీరంలో జరిగే ప్రతి ఒక్క పనులను కూడా ఎంతగానో నియంత్రిస్తుంది. మనం ప్రస్తుతం తింటున్న ఆహారంలోని శక్తి అనేది సుమారు 30% మెదడు భాగానికి చేరుతుంది. కాబట్టి మెదడును ఆరోగ్యపరంగానూ అలాగే షార్ప్ గాను పని చేయడానికి మంచి ఆహారం అనేది తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మెదడుకు ఎటువంటి హానికరం కలగకుండా మంచి ఆహారం తీసుకోవడం వల్ల పిల్లల మేధాశక్తి పెరుగుతుంది. అలాగే పెద్దవారిలోనూ మతిమరుపు త్వరగా రాకుండా ఉంటుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్లే మెదడు పనితీరు బాగుంటుంది.

మొదటగా ఆయుర్వేదంలో ప్రసిద్ధి చెందిన నల్ల ఉసిరి అనేది మెదడు శక్తికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే బ్రోకలీ ఇలాంటి కూరగాయలు కూడా మెదడులో తేలికపాటి ఆక్సిజన్ ఒత్తిడిని తగ్గించడానికి… వీటితోపాటుగా గుర్తు శక్తిని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. వీటన్నిటితోపాటుగా విటమిన్ ఈ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు చాలా బాగుంటుంది. ముఖ్యంగా గింజలు మరియు తేనె లాంటివి మెదడుకు మంచి బలాన్ని అందజేస్తుంది. చాపలు, నూనెలు మంచి వనరులు కాబట్టి ఇవి మెదడు ను చురుకుగా ఉంచుతూ… మానసిక శక్తిని పెంచుతుంటాయి. అలాగే ప్రతిరోజు కాఫీ తాగడం వల్ల మెదడుకు ఉద్దేశం అనేది కలుగుతుంది. కాఫీ తాగడం వల్ల మెదడు మానసిక అలసటను తగ్గించి… కొంచెం ఉపశమనం కలిగిస్తుంది. కాఫీలో ఉండే ప్రత్యేక రసాయనాలు మెదడులోని అలసటకు కారణమయ్యే పదార్థాల చర్యను తగ్గించి మనసును ఉత్తేజపరుస్తుంది.

కాబట్టి ప్రతిరోజు కూడా ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మెదడు పనితీరు అనేది సక్రమంగా జరుగుతుంది.

NOTEఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఒకవేళ మీ బ్రెయిన్ మీ నియంత్రణలో లేకపోతే వెంటనే నిపుణులను సంప్రదించడం మంచిది.

ఐపీఎల్ 2025 లో చెత్త ప్రదర్శన ఇచ్చిన టాప్ క్రికెటర్స్ ఎవరో తెలుసా?
చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభం, నేరుగా కాశ్మీర్ కు వందేభారత్ పరుగులు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button