
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- వరుస మరణాలతో గుంటూరు రూరల్ మండలంలోని తురకపాలెం గ్రామం ఈమధ్య సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అనారోగ్య కారణంగా ఈ గ్రామంలో చాలా మంది ఇప్పటికే మృతి చెందిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అని రంగంలోకి దిగిన అధికారులు ఈ మరణాలకు కారణాలని కనుగొన్నామని చెబుతున్నారు. దీనికి అసలు కారణం యూరేనియమని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తురకపాలెం గ్రామ సమీపంలో ఉన్నటువంటి నీటిని చెన్నై ల్యాబ్ లో పరీక్షలు చేయించగా.. ఈ నీళ్లలో యురేనియం అవశేషాలు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. యురేనియం తో పాటుగా స్ట్రాన్షియం అనే ఎలిమెంట్ అలాగే ఈకొలి బ్యాక్టీరియా కూడా ఉన్నట్లుగా సమాచారం అందించారు. ఈ నీటిని తాగడం వల్ల స్థానికులు అనారోగ్యం బారిన పడుతున్నట్లుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది.
Read also : కుర్రకారు మతి పోగొడుతున్న మిరాయ్ హీరోయిన్ రితిక!
తురకపాలెం గ్రామంలో వరుస మరణాలకు యురేనియమే కారణమని అధికారులు చెబుతుండగా.. స్థానికులు కూడా అదే భావిస్తున్నారు. ఈ గ్రామంలో యురేనియం అవశేషాలు బయటపడినట్లుగా సోషల్ మీడియాలో అలాగే మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున రాగ… దీని పైనే ప్రస్తుతం అందరూ కూడా చర్చిస్తూ ఉన్నారు. మరోవైపు నీరు మరియు ఆహారం వల్ల యూరేనియం శరీరంలోకి ప్రవేశిస్తే అది కిడ్నీలపై ప్రభావం చూపుతుందని… యురేనియం ఉన్న నీరు, ఆహారం తీసుకోవడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయని వైద్యులు చెప్పుకొస్తున్నారు. కేవలం కిడ్నీలు మాత్రమే కాకుండా చర్మం, లంగ్స్, లివర్ అలాగే ఎముకలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు స్పష్టంగా వివరిస్తున్నారు. దీనివల్లనే గ్రామం మొత్తం కూడా అనారోగ్యం బారిన పడుతున్నారు అని.. దీనివల్ల చనిపోయే ప్రమాదం తక్కువైనప్పటికీ ఎక్కువ మంది అనారోగ్యానికి గురవుతూ ఉంటారని వైద్యులు చెప్పుకొస్తున్న విషయం ఇది. కాగా ఇప్పటికే ఈ గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపు ద్వారా అనారోగ్యం బారిన పడిన వారందరినీ వైద్యులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. యురేనియం అవశేషాలు బయటపడడంతో… ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు అని అధికారులు చెప్పినా… ఈ నీళ్లనే ఎన్నో ఏళ్లుగా తాగుతున్నాము.. అప్పుడు రానటువంటి అనారోగ్యం ఇప్పుడు ఎందుకు కలుగుతుంది ప్రజలు మరో విధంగా అధికారులను ప్రశ్నిస్తున్నారు.
Read also : పహల్గాం ఎఫెక్ట్.. IND vs PAK మ్యాచ్ కు కరువైన ఆసక్తి!