క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- టి20 వరల్డ్ కప్ లో భాగంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ మరియు సౌత్ ఆఫ్రికా జట్లు నిన్న సూపర్-8 లో భాగంగా ఢీకొన్నాయి. ఇరుజట్ల మధ్య నిన్న రాత్రి 7 గంటలకు మ్యాచ్ జరగగా ఇందులో భారత్ పై సౌత్ ఆఫ్రికా జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఒక విధంగా చెప్పాలి అంటే భారత జట్టు బ్యాట్స్మెన్లను ప్రోటీన్ జట్టు చిత్తుచిత్తు చేసింది. ఏకంగా 76 పరుగులతో సౌత్ఆఫ్రికా జట్టు విజయాన్ని నమోదు చేసింది అంటే ఆ మాత్రం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్లో కీలకపాత్ర పోషించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది డేవిడ్ మిల్లర్. వరుస వికెట్లతో ఆరంభంలో డీలపడ్డ సౌత్ ఆఫ్రికా జట్టును డేవిడ్ మిల్లర్ అలాగే బ్రివిస్ ఆదుకున్నారు. లేదంటే అతి తక్కువ పరుగులకే సౌత్ ఆఫ్రికా జట్టు లక్ష్యాన్ని గురుపెట్టేది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా జట్టు కేవలం 111 పరుగులకే ఆల్ ఔట్ అయింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేశవ్ మహారాజ్, జాన్సన్, ఎంగిడి, మార్కమ్ మరియు బోష్ ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా బౌలింగ్ వేశారు. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా గెలవడానికి ముఖ్య కారణం డేవిడ్ మిల్లర్ అలాగే ఆ జట్టు బౌలర్స్. డేవిడ్ మిల్లర్ మిడిల్ ఆర్డర్లో వికెట్ పడకుండా విరుచుకు పడడంతో భారీ లక్ష్యాన్ని భారత్ ముందు పెట్టింది. మరోవైపు మొదట్లోనే భారత జట్టు మూడు వికెట్లు కోల్పోవడంతో డీలపడింది.
పెళ్లి ముసుగులో భారీ మోసాలు.. సజ్జనార్ కీలక సూచనలు?
ఈ జిల్లాల్లో మరో మూడు గంటల్లో భారీ వర్షాలు!

