
ఐపీఎల్‌లో ఫిక్సింగ్!
రాజస్థాన్ రాయల్స్ వరుస ఓటములపై డౌట్లు
గెలిచే మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తున్న ఆర్‌ఆర్
రెండు మ్యాచుల్లో 9 పరుగుల తేడాతో ఓటమి
ఇది కచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగే
ఆర్‌సీఏ కన్వీనర్ బిహానీ సంచలన వ్యాఖ్యలు
బీసీసీఐ స్పందనపై సర్వత్రా ఉత్కంఠ
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :-
ఐపీఎఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్న ప్రచారం కలకలం రేపుతోంది. మ్యాచ్ ఫిక్సింగ్ వార్తలతో క్రికెట్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. తాము ఎంతో ఉత్కంఠగా చూస్తున్న మ్యాచులన్నీ ముందే ఫిక్స్ అవుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ప్రచారం జరగడానికి కారణం రాజస్థాన్ రాయల్స్ వరుస ఓటములు. గెలవాల్సిన మ్యాచ్ లలో కూడా ఆ జట్టు ఓడిపోతోందని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుత ఐపీఎల్ – 2025 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అనుకున్న స్థాయిలో రాణించలేక పోతోంది. ఆ జట్టు ప్రస్తుతం రెండు విజయాలు, ఐదు పరాజయాలతో పాయింట్ల పట్టిక లో ఎనిమిదవ స్థానంలో ఉంది. గెలుపు ముంగిట దాకా వచ్చి ఆర్ఆర్ బోల్తా పడడం అభిమానులను కలవరపెడుతోంది. గత రెండు మ్యాచుల్లో ఇదే జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో చివరి ఓవర్ లో కేవలం తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది.
ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్న ప్రచారం కలకలం రేపుతోంది. మ్యాచ్ ఫిక్సింగ్ వార్తలతో క్రికెట్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. తాము ఎంతో ఉత్కంఠగా చూస్తున్న మ్యాచ్ లన్నీ ముందే ఫిక్స్ అవుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ప్రచారం జరగడానికి కారణం రాజస్థాన్ రాయల్స్ వరుస ఓటములు. గెలవాల్సిన మ్యాచ్ లలో కూడా ఆ జట్టు ఓడిపోతోందని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుత ఐపీఎల్ – 2025 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అనుకున్న స్థాయిలో రాణించలేక పోతోంది. ఆ జట్టు ప్రస్తుతం రెండు విజయాలు, ఐదు పరాజయాలతో పాయింట్ల పట్టిక లో ఎనిమిదవ స్థానంలో ఉంది. గెలుపు ముంగిట దాకా వచ్చి ఆర్ ఆర్ బోల్తా పడడం అభిమానులను కలవరపెడుతోంది. గత రెండు మ్యాచుల్లో ఇదే జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ ( డీ సీ ) తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో కేవలం తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. అలాగే లక్నో సూపర్ జెయింట్స్ ( ఎల్ ఎస్ జి ) తో ఏప్రిల్ 19 న జరిగిన మ్యాచ్ లో కూడా మళ్లీ చివరి ఓవర్ లో తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యింది ఆర్ ఆర్ టీం. అంతే కాదు ఈ మ్యాచ్ లో అయితే కేవలం రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇలా ఈజీగా గెలవాల్సిన మ్యాచుల్లో ఓడిపోవడంతో ఆర్ ఆర్ జట్టుపై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. క్రీజులో విధ్వంసకర ఆటగాళ్ళు ధృవ్ జురెల్, హెట్ మైర్ ఉన్నారు. అయినా రాజస్థాన్ రాయల్స్ చివరి ఓవర్ లో ఆరు పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఎల్ ఎస్ జి తో జరిగిన మ్యాచ్ లో ఆర్ ఆర్ ప్రదర్శనపై రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ( ఆర్ సీ ఏ ) అడహక్ కమిటీ కన్వీనర్ జై దీప్ బిహానీ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. చివరి ఓవర్ లో గెలవడానికి కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే అవసరమైనప్పుడు ఒక జట్టు ఐపీఎల్ లో ఎలా ఓడిపోతుందని ఆయన ప్రశ్నించారు. చివరి ఓవర్ లో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలను గమనిస్తే మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని చిన్న పిల్లవాడికి కూడా అర్థమవుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై వెంటనే విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. 2013 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్ళు స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడిన విషయాన్ని బిహానీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్ ఆర్ సహా యజమాని రాజ్ కుంద్రా బెట్టింగ్ కు పాల్పడడంతో 2016, 2017 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ పై నిషేధం విధించారన్న విషయాన్ని బిహానీ ఇక్కడ గుర్తుకు చేశాడు. అప్పట్లో రాజస్థాన్ రాయల్స్ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ పై కూడా రెండు సీజన్ ల నిషేధం విధించారు. కాగా బిహానీ ప్రస్తుతం చేసిన ఆరోపణలపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.