
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగకు కొన్ని పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ కాగా అందులో ప్రస్తుతం చిరంజీవి సినిమా దూసుకుపోతుంది. ప్రభాస్, చిరంజీవి, రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టి సినిమాలు రిలీజ్ అవ్వగా ఈ నలుగురు హీరోలలో చిరంజీవి సినిమా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎందుకంటే ఈ సినిమా కేవలం విడుదలైన ఐదు రోజుల్లోనే ఏకంగా 226 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావుపూడి డైరెక్షన్ లో వచ్చినటువంటి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా ఈరోజుటికి కూడా కలెక్షన్లలో దూసుకుపోతూ ఉంది. కేవలం ఐదు రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ రాబట్టినట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఇది ఓ ప్రాంతీయ చిత్రానికి ఆల్ టైం రికార్డ్ అని వెల్లడించారు. మరోవైపు ఇవ్వాళ శనివారం, రేపు ఆదివారం కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ రెండు రోజుల్లో కూడా ఇదే ఊపుతో కలెక్షన్లు వస్తే మాత్రం సులభంగా 300 కోట్లు కలెక్షన్లు రావడం చాలా సులభం. ఏది ఏమైనా కూడా ఈ సంక్రాంతికి చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమానే విన్నర్ గా నిలిచింది. మరోవైపు ప్రభాస్ అలాగే రవితేజ సినిమాలు కూడా మంచి కలెక్షన్లు రాబడుతున్న కూడా వాటన్నిటిని మించి చిరంజీవి సినిమా భారీ కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఈ సంక్రాంతి విన్నర్ చిరంజీవి.
సంక్రాంతి వేల పందులు, పొట్టేళ్ల ఫైట్లు చూశారా?
Road Accidents: ఐదేండ్లలో 3.35 లక్షల మంది మృతి, టోల్ ప్లాజాల్లో ఇక నో నగదు చెల్లింపు!





