
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- టాలీవుడ్ లో ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందన పెళ్లి గురించి చాలా రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు జోరుగా ప్రచారం అవుతూ ఉన్నాయి. రెండు రోజుల నుంచి రష్మిక మరియు విజయ్ దేవరకొండ పెళ్లి రేపు ఘనంగా జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో నిన్న పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ మరోవైపు వీరిద్దరి పెళ్లి ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయపూర్ లో ఘనంగా జరగబోతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి అని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని పేర్కొంది. కానీ ఈ పెళ్లి విషయంపై ఇప్పటివరకు విజయ్ దేవరకొండ గానీ లేదా రష్మిక మందన గాని ఇద్దరూ కూడా అధికారికంగా అయితే ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం వీరిద్దరూ “రణబాలి” అనే సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతంలో కూడా ఎన్నో రూమర్సు వీళ్లిద్దరి పై రాగా కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు స్పష్టం అయ్యింది. ఇక వీరిద్దరి AI పెళ్లి ఫోటోలు కూడా గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. మరి వీరి పెళ్లి ఏ తేదీన జరుగుతుందో వీరిద్దరే ఒక క్లారిటీ ఇస్తే గాని ఫ్యాన్స్ అందరూ కూడా గమ్ముగా ఉండేలా కనిపించడం లేదు.
Read also : ఆంధ్రాలో అగ్గిరాజుకుంటున్న రాజకీయాలు, నాయకుల ఇళ్లపై దాడులు.. ప్రస్తుత పరిస్థితి ఏంటి?
Read also : ఏంజేపి బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్





