జాతీయం

ఎన్టీఆర్ కొడుకులు సినిమా రంగంలోకి అడుగుపెట్టే అవకాశాలు లేనట్టేనా...?

ప్రస్తుతం మన టాలీవుడ్ ఇండస్ట్రీ భారతదేశంలో ది టాప్ మోస్ట్ ఇండస్ట్రీగా నిలిచి ఉంది. క్రమం క్రమంగా మన టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా మూవీస్ చేస్తూ మన టాలీవుడ్ ఇండస్ట్రీని వేరే స్థాయికి తీసుకెళ్తున్నారు. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ సినిమా ఇండస్ట్రీలో తండ్రి తర్వాత వాళ్ళ వారసులు కూడా సినిమా రంగంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇలా ఇది ఒక అలవాటుగా మారిపోయింది ప్రతి ఒక్కరికి. చాలామంది కూడా తండ్రి స్థానంలోని నడవాలని అనుకుంటూ తండ్రి రంగాన్ని వాళ్లు కూడా ఎంచుకుంటున్నారు.

అయితే ప్రస్తుతం మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ అలాగే తన కొడుకుల పై ఒక ప్రశ్న ఎదురు కాగా అది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ మీడియా చూసినా ఇదే ప్రశ్న అందరి నోట వినబడుతుంది. అయితే ఒక లాస్ ఏంజెల్స్ లో దేవర సక్సెస్ మీట్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్కి ఒక ప్రశ్న ఎదురయింది. అదేంటంటే మీ ఇద్దరు కొడుకులు అదే అభయ్ మరియు భార్గవ్ సినిమా రంగంలోకి ప్రవేశించే అవకాశం ఉందా అని అడిగారు. దానికి ఎన్టీఆర్ స్పందిస్తూ ఈ కాలం పిల్లలకి సొంత నిర్ణయాలు తీసుకోవడం చాలా చోట్ల చూశాం. నాకు నచ్చింది వాళ్ళకి నచ్చాలని లేదు. అలాగే నా ఇష్టాలు కోరికలు పిల్లలపై రుద్దడం సరికాదని ఎన్టీఆర్ దీనికి వెంటనే సమాధానం అనేది ఇచ్చాడు. అయితే అభయ్ అలాగే భార్గవ్ వీళ్లిద్దరి మధ్య ఆలోచన తీరులో కూడా చాలా వ్యత్యాసం ఉంది. వీళ్ళిద్దరూ కచ్చితంగా మూవీలోకి రావాలని… అలాగే యాక్టింగ్ లో రాణించాలని నేనెప్పుడూ ఫోర్స్ చేయలేదు. ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను అలా చిన్నప్పుడు నుంచి నా ఆలోచనలు తగ్గట్టుగా ముందుకు వెళ్ళు అని సపోర్ట్ చేశారు. నాకు నటన అంటే ఇష్టం కాబట్టి నేను సినిమా రంగంలోకి వచ్చాను. అంతే తప్ప నన్ను కూడా ఎవరూ ఫోర్స్ చేయలేదు. నా పిల్లలకి వారి సంత ఆలోచనలు ఉండాలని అనుకుంటున్నా అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. దీంతో ఎన్టీఆర్ పై యావత్ సినిమా ప్రేక్షకులు అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ పై తన కొడుకులపై ఉన్న నమ్మకం పై ప్రశంసలు కురిపించారు.

Read More : సీజన్ ముగిసినా వదలని వాన.. మరో నాలుగు రోజులు కుండపోత

వారం క్రితం ఎన్టీఆర్ మరియు కొరటాల కాంబినేషన్లో వచ్చిన దేవర సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలతో ముందుకు దూసుకుపోతుంది. ఏకంగా 500 కోట్ల కలెక్షన్ గ్రాస్ ను దాటుకుంటూ రికార్డు సృష్టించింది. ఇక ముందు దసరా సెలవులు ఉండడంతో ఈ కలెక్షన్లు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. దీంతో ఫ్యాన్స్ అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ కొడుకులు అయినటువంటి అభయ్ అలాగే భార్గవ్ ఇద్దరు కూడా సినిమాల్లోకి రావాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరి కొంతమంది ఇద్దరిలో ఒకరైన సరే సినిమా రంగంలోకి అడుగు పెట్టాలని అది మా కోరిక అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ కూడా సినిమా ఎంట్రీ అనేది ఇవ్వబోతున్నాడు. కాబట్టి నందమూరి ఫ్యామిలీలో ఇప్పటికే చాలామంది హీరోలు ఉన్నారు. మరి వీళ్ళిద్దరూ సినిమా రంగంలోకి అడుగు పెట్టాలంటే కొన్ని సంవత్సరాలు వేచి చూడాల్సిందే.

Back to top button