PM Kisan: వారికి డబ్బులు నిలిపివేత!

PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 22వ విడత నిధుల కోసం దేశవ్యాప్తంగా రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 22వ విడత నిధుల కోసం దేశవ్యాప్తంగా రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గత విడతల్లో కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోకి ఆర్థిక సాయం జమ చేస్తూ వస్తుండగా, ఇప్పుడు వచ్చే విడతపై రైతుల్లో ఆశలు పెరిగాయి. సాగు ఖర్చులు, కుటుంబ అవసరాల కోసం ఈ నిధులు కీలకంగా మారాయి.

కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు పీఎం కిసాన్ 22వ విడత నిధులు ఫిబ్రవరి నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా తేదీని ఇంకా ప్రకటించలేదు. గతంలో అనుసరించిన విధానాన్ని బట్టి ఫిబ్రవరి మధ్యలో లేదా చివరి వారంలో నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని రైతులు అంచనా వేస్తున్నారు.

అయితే ఈ విడతలో ప్రతి రైతుకు నిధులు అందుతాయా అనే అంశంపై కొంత అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా e-KYC పూర్తి చేయని రైతుల వాయిదాలు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే పలు విడతల్లో కేవైసీ పూర్తికాని రైతులకు నిధులు జమ కాకపోవడంతో ఈసారి కూడా అదే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది.

రైతులు తమకు నిధులు అందాలంటే తప్పనిసరిగా PM కిసాన్ e-KYC ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను రైతులు ఇంటి నుండే సులభంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా e-KYCని పూర్తి చేయవచ్చు.

డిజిటల్ సౌకర్యాలు లేని రైతులు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లలో కూడా e-KYC చేయించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల తమ ఖాతా అర్హతలో ఉందో లేదో కూడా నిర్ధారించుకోవచ్చు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నా కొంతమంది రైతులు ఇంకా కేవైసీ పూర్తి చేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం రైతులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు. పథకం స్థితి, లబ్ధిదారుల వివరాలు, e-KYC ప్రక్రియ వంటి అంశాలను pmlisan.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. 22వ విడత నిధులు అందాలంటే వెంటనే e-KYC పూర్తి చేయాలని రైతులకు సూచిస్తున్నారు.

ALSO READ: మహిళలకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికీ రూ.1.4 లక్షలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button